Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అబ్బుర పరిచే ఆరుగురు యువరాణులు.. ధైర్య సాహసాలే మహిళలకు స్ఫూర్తి.. నవంబర్ 22న మరోసారి..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ తాను నిర్మించే చిత్రాల్లో మహిళలకు, యువతులకు పెద్ద పీట వేస్తుంది. గత చిత్రాల్లో మహిళా సాధికారితను ప్రతిబింబించే పాత్రలతో చిత్రాలను నిర్మించింది. తాజాగా ఫ్రొజెన్ 2 సినిమాతో డిస్నీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఫ్రోజెన్‌లో కూడా ఎల్సా, అన్నా పాత్రలు ప్రధానమైనవే. ఈ క్రమంలో డిస్నీ రూపొందించిన మహిళా నేపథ్యం ఉన్న సినిమాలు మీకోసం..

మేరీ పాపిన్స్
నాని, మేరి పాపిన్స్ చిత్రమైన, భావోద్వేగమైన పాత్రలు. డిస్నీ వరల్డ్ తొలిసారి రూపొందించిన సినిమాలో ఫన్నీగా, తుంటరిగా ఉండే పాత్రలు ప్రేక్షకుల మదిలొ నిలిచిపోయాయి. లైవ్ యాక్షన్ తీరుతో 1964లో జూలీ ఆండ్రూస్ ద్వారా పరిచయయ్యాయి. ఆ తర్వాత 2019లో ఎమిలీ బ్లంట్ రీమేక్ చేసిన మూవీలో మేరీ పాపిన్స్ ప్రేక్షకుల ముందు సజీవంగా నిలిచింది. మేరీ పాపిన్స్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన నిత్యసత్యాలు ఎన్నో కనిపిస్తాయి. డిస్ని రూపొందించిన ఫెమినిస్టు ఐకాన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే.. నీ తప్పు లేకుంటే క్షమాపణలు చెప్పకూడదు అనే సందేశాన్ని తన పాత్ర నుంచి ఇస్తుంది. అన్ని కోణాల్లో మేరి పాపిన్స్ పాత్ర ప్రాక్టికాలిటీకి పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తుంది.

పోకహోంటాస్
1995లో యానిమేటేడ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా విడుదలైన చిత్రం పోకాహోంటాస్. ఈ తరంలోని ఎందరో అమ్మాయిలు పొకాహోంటాస్‌ను స్ఫూర్తిగా తీసుకొని పెరిగి పెద్దయి ఉంటారు. వాల్ట్ డిస్నీ ఫీచర్స్ యానిమేషన్ ఫర్ వాల్ట్ డిస్నీ పిక్సర్స్ రూపొందించిన సృష్టించిన పూర్తిస్థాయి ఫెమినిస్ట్ ఐకాన్ పాత్ర. అన్యాయం, అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన పొకాహోంటాస్ తొలి నల్లజాతీ మహిళ. లింగ ప్రధానమైన వివక్ష ఎదురైతే ఎన్నడూ తలవంచుకు అంటూ పోరాటం సాగించారు. యదార్థ జీవిత కథ నుంచి పొకాహోంటాస్ చిత్రం రూపొందింది. వెనుకబడిన తెగకు చెందిన నుంచి వచ్చి ఎంతో మంది యువతి, యువకులకు స్ఫూర్తిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ములన్
మహిళల్లో స్ఫూర్తిని నింపడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా 1998లో డిస్నీ రూపొందించిన చిత్రం ములాన్. ములాన్ యువరాణి కాదు. కేవలం సామాన్యురాలే. తన కాలంలో మహిళలకు ఎదురైన వివక్షతో సమాజంపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన యువతి. యుద్ధంలో గాయపడిన తన తండ్రి స్థానంలో సైన్యంలో చేరుతుంది. ఆమె ధైర్యసాహసాలు ఆమెను ఓ యువరాణిగా భావించేందుకు ప్రధాన కారణమైందని చెప్పవచ్చు.

ప్రిన్సెస్ అండ్ ది ఫ్రాగ్
వెండితెర మీద వాల్ట్ డిస్నీ చూపించిన యువరాణుల పాత్రలను చూస్తే ది ప్రిన్సెసెస్ అండ్ ది ఫ్రాంగ్ సినిమాలో తియానా పాత్ర చాలా విభిన్నమైనది. డిస్నీ సినిమాలో కనిపించిన యువరాణుల్లో తొలి ఆఫ్రికా అమెరికన్ సంతతి యువతిగా చెప్పుకోవచ్చు. తనకంటే ముందు తరంలో వచ్చిన యువరాణుల కంటే కొంచెం రెబెల్ క్యారెక్టర్. జీవితంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలనే లక్ష్యంతో ప్రయాణం చేస్తుంటుంది. అంతేకాకుండా దుష్టశక్తి కారణంగా కప్పగా మారిన నవీన్‌కు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. నవీన్ కోసం స్వయంగా తాను కూడా కప్పగా మారిపోతుంది. జీవితం పట్ల ఫోకస్, లక్ష్యసాధన ఉన్న యువతిగా తియానా కనిపిస్తుంది.

మొవానా
ఇప్పటి వరకు వాల్ట్ డస్నీ తెరకెక్కించిన యువరాణుల పాత్రల్లో అత్యంత తిరుగుబాటు తత్వం ఉన్న యువతిగా మొవానాగా చెప్పుకోవచ్చు. ఈమె పోలినేషియా ప్రాంతానికి చెందిన యువతి. సాధారణమైన లక్షణాలు, కచ్చితమైన మనస్తత్వం ఉన్న డిస్నీ యువరాణిగా కనిపించింది. సముద్ర నేపథ్యంగా సాగే మూవీలో తన ద్వీపాన్ని శత్రువుల నుంచి రక్షించుకోవడానికి మొవానా చేసే సాహసాలు అద్భుతంగా ఆకట్టుకొంటాయి. 16 యువతి పాత్ర ధైర్య సాహసాలకు మారుపేరుగా కనిపిస్తుంది. దుష్టశక్తుల నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా.. తన జీవితానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకొనే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తన సోదరి అన్నా సహాయంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో తన సోదరి కంటే మరెవరూ ఎక్కువ కాదనే భావనతో ఉంటుంది. నవంబర్ 22న ఫ్రొజెన్ సినిమాకు సీక్వెల్‌గా ఫ్రోజెన్ 2 వస్తున్నది. తమ పుట్టుక, తమకు సంక్రమించిన అతీంద్రియ శక్తుల వెనుక రహస్యాన్ని తెలుసుకొనే నేపథ్యంగా సినిమా సాగుతుంది.

ఫ్రోజెన్
ఫ్రోజెన్ మూవీ హాన్స్ అండెర్సన్ రాసిన స్నో క్వీన్ అనే కథ నుంచి రూపొందింది. ఈ సంప్రదాయ ప్రేమ కథలకు విభిన్నంగా ఉంటుంది. రొమాంటిక్ లైఫ్ కంటే సోదరి ప్రేమకు ప్రధాన్యమిచ్చే కథ. ఈ కథలో మంచు పర్వతాల్లో ఉండే ఎల్సా అందర్ని ఆకట్టుకొంటుంది. తొలిభాగంలో ఎల్సాను సోదరి అన్నా కంటికి రెప్పలా చూసుకొంటూ ఎన్నో ఆపదల నుంచి కాపాడుతుంది. దుష్టశక్తుల నుంచి తనకు తాను కాపాడుకోవడమే కాకుండా, తన జీవితానికి సంబంధించిన అనేక అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంది. తన సోదరి అన్నా సహకారంతో తన జీవిత రహస్యాన్ని తెలుసుకొనేందుకు నదీ ప్రయాణాన్ని సాగిస్తుంది. ఎల్సా జీవితానికి సంబంధి తలెత్తె ఎన్నో ప్రశ్నలకు ఫ్రొజెన్ 2 సీక్వెల్ సమాధానంగా నిలుస్తుంది. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.