»   » హోటల్‌ గదిలో ఉరేసుకుని, ప్రముఖ టీవీ నటి సూసైడ్‌

హోటల్‌ గదిలో ఉరేసుకుని, ప్రముఖ టీవీ నటి సూసైడ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అన్‌బ్రేకబుల్‌ కిమ్మీ షుమిడ్ట్‌, లా అండ్‌ ఆర్డర్‌: స్పెషల్‌ విక్టిమ్స్‌ యూనిట్‌, అగ్లీ బెట్టీ, గాసిప్‌ గర్ల్‌ వంటి టాప్‌ టీవీ షోల్లో నటించిన ప్రముఖ టీవీ నటి లిసా లిన్‌ మాస్టర్స్‌ సూసైడ్ చేసుకుని మృతి చెందింది.

లిసా లిన్‌ మాస్టర్స్‌ తన హోటల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. పెరూ రాజధాని లిమాలోని న్యూవో ముండా హోటల్‌లో మంగళవారం రాత్రి ఆమె మృతి చెంది ఉండగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

Actress Lisa Masters Found Dead In Peru After Apparent Suicide

లాస్... మోడలింగ్‌ ట్రిప్‌ కోసం పెరూకు వచ్చింది. 52 ఏళ్ల లిసా స్కర్ట్‌తో ఉరేసుకొని మృతిచెందడాన్ని మొదట హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత మేనేజ్ మెంట్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు.

లిసా కొంతకాలంగా మానసిక కుంగుబాటుతో సతమతమవుతున్నదని, ఇందుకోసం చికిత్స పొందుతున్న ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. లిసా పలు సూపర్‌ హిట్‌ టీవీషోల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

English summary
Actress Lisa Masters – who you may recognize from Law & Order: SVU, Ugly Betty, and The Stepford Wives — was found dead on Tuesday in her Lima, Peru hotel room after an apparent suicide. Hotel employees discovered the 52-year-old in the closet around 11:50 p.m., after she reportedly hung herself with a skirt — according to the newspaper Peru 21. She was traveling on a modeling assignment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu