ఎలాన్ మస్క్, టామ్ క్రూజ్‌కు పోటీగా రష్యా స్పేస్ సినిమా.. అంతరిక్షంలో సాహసయాత్ర!
సినిమా విషయంలో హాలీవుడ్, రష్యన్ సినిమాలు ఎప్పుడో ప్రేక్షకుల అంచనాలను దాటేశాయి. లోకల్, నాన్ లోకల్ అనే పదాలను మర్చిపోయేలా చేసి గ్లోబల్ ఈజ్ లోకల్ అనేలా సినిమా చేస్తున్నారు. ఇక గ్రాఫిక్స్ ద్వారా అంతరిక్షాన్ని వెండితెరపై చూపించిన మేకర్స్ ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో షూటింగ్ చేయడానికి సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాన్ మస్క్, టామ్ క్రూజ్ ఇదివరకే వారి ప్రాజెక్టులతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు రష్యా కూడా పవర్ఫుల్ గా సిద్ధమవుతోంది.

స్పెస్ లో షూటింగ్
భవిష్యత్తులో షూటింగ్స్ అనేవి గ్రాఫిక్స్ కంటే కూడా రియాలిటీ లోకేషన్స్‌లో ఎక్కువగా జరగవచ్చని తెలుస్తోంది. అంతరిక్షంలోకి వెళ్లాడమే ఒక సాహసం. అలాంటిది అక్కడ సినిమా షూటింగ్ చేయడమంటే మరో పెద్ద టాస్క్. గ్రావిటీ, మార్షన్, ప్యాసింజర్స్ లాంటి స్పేస్ సినిమాలను గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ మిక్స్ చేసి కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో వెళ్లి షూటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు.

రష్యా వారి కంటే బలంగా..
అంతరిక్ష పరిశోధనల్లో రష్యా ఏ విషయంలో అయినా అగ్ర దేశాలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇక ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో స్పెషల్‌గా చెప్పనవసరం. లేదు. ఇక టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ నెక్స్ట్ పార్ట్ ను అంతరిక్షంలో రెడీ చేయబోతున్నారు. ఇక వారికంటే బలంగా ఉండాలని రష్యా కాస్మోస్‌లో తొలి సినిమా చేయడానికి నటులను అలాగే దర్శకుడిని స్పెస్ లోకి పంపిస్తామని తెలిపింది.

నాసాతో టామ్ క్రూజ్
రష్యా అంతరిక్ష సంస్థ ఇప్పటికే నటీనటులకు కొన్ని సూచలను జారీ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్2 లో సినిమా షూట్ చేయడం కోసం టామ్ క్రూజ్ నాసాతో పలు శిక్షణాలు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నాసా గతేడాది తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కంటే అత్యదిక స్థాయిలో ఉండాలని రష్యా అంతరిక్ష సంస్థ ప్లాన్ చేసింది.

గవర్నమెంట్ ప్రొడక్షన్ లోనే రష్యా స్పెస్ సినిమా
రష్యన్ సినిమా వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్‌తో పాటు దర్శకుడు, నటుడు క్లిమ్ షిపెంకో ఆ సినిమాలో నటించబోతున్నారు. ఛాలెంజ్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేస్తున్నారు. ఇక రష్యా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును రోస్కోస్మోస్ అధినేత డిమిత్రి రోగోజిన్‌తో కలిసి నిర్మిస్తోంది. వారి ప్రణాళిక అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే రష్యా మరోసారి నెంబర్ వన్ అనిపించుకోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











