Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దుస్తులు మార్చుకుంటుండగా సెక్స్ సీన్లు.. పరువు నష్టం 65 కోట్లు.. నిర్మాతపై నటి కేసు
తన అనుమతి లేకుండా న్యూడ్ సీన్లను చిత్రంలో వాడుకోవడంపై సదరు నిర్మాతపై హాలీవుడ్ నటి అంబెర్ హర్డ్ నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేసింది. 2015లో విడుదలైన చిత్రం లండన్ ఫీల్డ్స్‌లో శృంగార సన్నివేశాలను వాడుకొన్నారని అంబెర్ ఆరోపించింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ డెప్‌కు అంబర్ హార్డ్ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే.

65 కోట్లకు పరువు నష్టం
లండన్ ఫీల్డ్ చిత్రంలో కొన్ని శృంగార, న్యూడ్ సీన్లు ఉన్నాయి. అయితే తన అనుమతి లేకుండా వాటిని సినిమాలో పెట్టారు. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. పరువు నష్టం కింద రూ.65 కోట్లు (10 మిలియన్ అమెరికా డాలర్లు) చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నది.

దుస్తులు మార్చుకొంటుండగా..
షూటింగ్‌కు సంబంధించని ఫొటోలు కూడా వాడుకొన్నారు. దుస్తులు మార్చుకొనే దృశ్యాలను చిత్రీకరించారు. అలాంటి ఫొటోలను షూట్ చేసే హక్కు నిర్మాతలకు లేదు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వాటిని చేర్చారు. అశ్లీల సన్నివేశాలను, కొన్ని మితీమీరిన శృంగార చిత్రాలను సినిమాలో జొప్పించారు అని మండిపడింది.

తెలియకుండా సెక్స్ సీన్లు..
న్యూడ్ సీన్లను సినిమాకు జత చేసి 2015లో టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించాడు. తన అనుమతి లేకుండా సన్నివేశాలను పబ్లిసిటీకి వాడుకోవడం సరికాదు అని అంబెర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటీనటులకు తెలియకుండా అభ్యంతరకర సన్నివేశాలను నిర్మాతలు వాడుకొంటున్నారనే వాదనకు ఈ కేసు మరింత బలం చేకూర్చింది.

ఆమెకు అంతా తెలుసు..
నటి అంబెర్ పిటిషన్ పై నిర్మాత హ్యాన్లీ, ఆయన భార్య రొబోర్టా స్పందించారు. మార్టిన్ అమిస్ నవల ఆధారంగా తెరకెక్కిన లండన్ ఫీల్డ్స్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి ఆమెతో కాంట్రాక్టు జరిగింది. స్క్రిప్ట్ చదివిన తర్వాతనే సినిమాలో నటించేందుకు సంతకం చేసింది. చిత్రంలో న్యూడ్ సీన్లు, సెక్స్ సన్నివేశాలు ఉంటాయనే విషయం ఆమెకు ముందే తెలుసు. అంతా తెలిసి ఆమె ఇప్పుడు కోర్టుకు ఎక్కడం విచిత్రంగా ఉంది అని వారు అన్నారు.