»   » కమ్యూనిస్టుల దురాగతాలపై సినిమా

కమ్యూనిస్టుల దురాగతాలపై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ :హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ .. ఏంజెలీనా జోలీ డైరక్టర్ గా ఇప్పుడో సంచలనాత్మక చిత్రానికి తెర తీస్తోంది. కంబోడియా కమ్యూనిస్టుల దురాగతాల పై ఈ చిత్రం రూపొందనుంది. ఆ చిత్రం పేరు..'ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌: ఏ డాటర్‌ ఆఫ్‌ కంబోడియా రిమెంబర్స్‌' . ప్రస్తుతం ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో పూర్తిగా మునిగి ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం నేపధ్యం వివరాల్లోకి వెళితే....1970లో 17లక్షల మందికిపైగా ప్రజలను బలి తీసుకున్న కంబోడియా కమ్యూనిస్టుల దురాగతాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.

Angelina Jolie Pitt To Direct First They Killed My Father

2002లో కంబోడియాకు చెందిన మాడక్స్‌ అనే అనాథ బాలుణ్ని దత్తత తీసుకుంది జోలీ. ఆ తర్వాత ఏడాది 'మాడక్స్‌ జోలీ పిట్‌(ఎమ్‌జేపీ)' ఫౌండేషన్‌ను ప్రారంభించింది. కంబోడియాలో పేదరికం కారణంగా ఎదురవుతున్న సమస్యలను రూపుమాపేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. తన అనంతరం ఫౌండేషన్‌కు మాడక్స్‌ సారథ్యం వహిస్తాడని జోలీ చెప్పింది.

జోలి మాట్లాడుతూ.... ''మాడక్స్‌కు ఇప్పుడు 14 ఏళ్లు. అతడు నా కొడుకు మాత్రమే కాదు కంబోడియా పుత్రుడు కూడా. ఇప్పుడిప్పుడే తన మాతృదేశం గురించి తెలుసుకుంటున్నాడు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను తనే నడిపిస్తాడ''ని చెప్పింది జోలీ.

English summary
Angelina Jolie Pitt will direct an adaptation of First They Killed My Father: A Daughter of Cambodia Remembers, a harrowing and poignant memoir from Cambodian author and human rights activist Loung Ung about surviving the deadly Khmer Rouge regime.
Please Wait while comments are loading...