»   » పబ్లిసిటీ కోసం మరీ దారుణంగా ఆరోపణలు చేస్తున్న రచయిత..!!

పబ్లిసిటీ కోసం మరీ దారుణంగా ఆరోపణలు చేస్తున్న రచయిత..!!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ ల గురించి 'బ్రాంజెలీనా' అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్ ఇన్నాళ్లు త్వరలో ఈ జంట విడిపోనుందని నానా హైరానా చేసిన ఆయన అందుకోసం ఎన్నో కారణాలను చూపించాడు. ఏంజలీనా చాలా కోపిస్టి అని, బ్రాడ్ పిట్ తాగుబోతు అని, అనిస్టాన్ విషయంలో వీరిద్దరికీ గొడవ వచ్చిందని ఇలా ఎన్నో కారణాలను చూపించాడు. కానీ ఈ జంట మాత్రం తమపై వచ్చిన పుకార్లను ఏమాత్రం పట్టించుకోకుండా తామిద్దరం కలిసే వున్నామని చెప్పకనే చెబుతోంది.

ఇదిలా వుంటే తను చెప్పింది ముమ్మాటికీ నిజమని చెప్పడానికో లేక పుస్తకం అమ్మకాలు పెంచుకోవడానికో మరో సారి ఏంజలీనా జోలీ మీద వివాదాస్పద ఆరోపనలు చేసాడు. ఏంజలీనా ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాతో రహస్యంగా లెస్బియన్ సెక్స్ సంబంధం సాగించిందని ఆయన ఆరోపించాడు. బెవేర్లీ విల్ షైర్ హోటల్ లో వీరిద్దరూ రహస్యంగా కలిసేవారని ఆయన ఆరోపించారు. అంతే కాదు జోలీ తన తాజా సినిమా సాల్ట్ సెట్ లో ఒకరితో శారీరక సంబంధాన్ని సాగించింది అని కూడా ఆయన ఆరోపించాడు. ఈ కారణం వల్లే ఈ జంట విడిపోతోందని మళ్లీ మొదటికి వచ్చాడు.

ఇది విన్న జోలీ అభిమానులు హాల్పెరిన్ పుస్తకం అమ్మకాలను పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని అతని మొహాన ఊస్తున్నారు. అయినా ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుంటున్న హాల్పెరిన్ మరో వివాదాశ్పద వ్యాఖ్యకోసం ఆలోచనలో పడ్డారంట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu