»   » 'ఆమె నగ్నంగా నిలబడి అమ్ముడుపోతోంది'.. గాయనిపై జర్నలిస్ట్ హాట్ కామెంట్స్!

'ఆమె నగ్నంగా నిలబడి అమ్ముడుపోతోంది'.. గాయనిపై జర్నలిస్ట్ హాట్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హాలీవుడ్ సింగర్ అరియనా గ్రాండేపై ప్రముఖ జర్నలిస్ట్ మోర్గాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పాప్ సింగర్‌గా, నటిగా 25 ఏళ్ల అరియనా దూసుకుపోతోంది. అరియనా మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. కానీ మోర్గాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై విరుచుకు పడుతున్నారు. అరియనా ఇటీవల ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో పెర్ఫామ్ చేసింది. దీని గురించి మాట్లాడుతూ మోర్గాన్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనితో వెంటనే అరియనాతో పాటు ఆమె తల్లి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

  నగ్నంగా నిలబడి

  నగ్నంగా నిలబడి

  ఇటీవల అరియనా లిటిల్ మిక్స్ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేసింది. ఆ ఆల్బమ్ గురించి జర్నలిస్ట్ మోర్గాన్ మాట్లాడుతూ అరియనతో పాటు ఆ ఆల్బమ్‌లో పాల్గొన్న వారందరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అరియనాతో పాటు లిటిల్ మిక్స్ ఆల్బంలోని వారంతా నగ్నంగా నిలబడి అమ్ముడు పోతున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

  నీ కొచ్చిన సమస్య ఏంటి

  నీ కొచ్చిన సమస్య ఏంటి

  మోర్గాన్ వ్యాఖ్యలపై అరియనా తల్లి జోన్ గ్రాండే వెంటనే స్పందించారు. అసలు నీకొచ్చిన సమస్య ఏంటి మోర్గాన్.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ విరుచుకుపడింది. ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలో మీ తల్లి నేర్పలేదా అంటూ ప్రశ్నించింది. ఓ టివి షోలో కూడా మహిళ గురించి ఇలాగే అసభ్యంగా మాట్లాడాడని విమర్శించింది. ఇప్పుడు లిటిల్ మిక్స్ ఆల్బమ్ గురించి వాగుతున్నావు.

  మహిళలు ఎలాగైనా

  మహిళలు ఎలాగైనా

  మోర్గాన్ వ్యాఖ్యలని తప్పుబడుతూ అరియనా ఘాటుగా స్పందించింది. మహిళలు అందంగా ఉంటారు, శృంగారవంతంగా కూడా ఉంటారు.. అదే సమయంలో గౌరవప్రదంగా కూడా ఉంటారని అరియనా తెలిపింది. ఎలాగైనా ఉండే ఛాయిస్ మహిళలకు ఉందని పేర్కొంది. మహిళల్ని అర్థం చేసుకోలేని నీలాంటి వాళ్లతో ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం అని తెలిపింది.

  అర్థనగ్నంగా ఉన్న ఫోటో

  అర్థనగ్నంగా ఉన్న ఫోటో

  మోర్గాన్ కు అరియనా ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చింది. మహిళలు నగ్నంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నావు. నీవు ఇక్కడ అర్థ నగ్నంగా ఉన్నావు ఇది కరెక్టేనా అంటూ అతడి ఫోటోని పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. మోర్గాన్ వ్యవహార శైలిపై చాలా మంది మహిళా సెలెబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు. తరచుగా అతడు మహిళలని టార్గెట్ చేస్తుండడంతో మండిపడుతున్నారు.

  English summary
  Ariana Grande blasts Piers Morgan over 'nudity' comments. Ariana Grande slams journalist Piers Morgan for passing offensive remarks against her and the members of Little Mix musical band
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more