Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
కథ ముగియలేదు, ఇంకా దుమ్ము రేపుతోంది... వసూళ్లు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ప్రపంచ సినిమా చరిత్రలో ప్రస్తుతం వసూళ్ల పరంగా టాప్ పొజిషన్లో ఉన్న చిత్రం 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్'. గతంలో నెం.1 స్థానంలో 'అవతార్' మూవీ ఉండగా ఆ రికార్డులను ఈ మార్వెల్ స్టూడియో మూవీ బద్దలు కొట్టింది. ఏప్రిల్‌లో ది ఎండ్ గేమ్ విడుదలవ్వగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభించింది. థియేటర్ రన్ ఎండ్ కావడంతో మార్వెల్ సంస్థ ఈ చిత్రాన్ని ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో అందుబాటోకి తెచ్చింది. అయితే ఇప్పటికీ ఈ చిత్రం అమెరికాలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. సినిమాను చూసేందుకు ఇంకా జనాలు థియేటర్లలోకి వస్తుండటంతో ప్రదర్శన కొనసాగుతోంది.

ఇప్పటికీ 100 థియేటర్లలో
ఎగ్జిబిటర్లు, స్టూడియోలు అందుకున్న బాక్స్ ఆఫీస్ రసీదుల ప్రకారం అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఇప్పటికీ యుఎస్‌లో 100 కి పైగా థియేటర్లలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకు 2.8 బిలియన్ డాలర్లు రాబట్టింది. ఇటీవల అమెరికాలో లేబర్ డే సందర్భంగా సుమారు 16,000 డాలర్లు రాబట్టింది.

రికార్డులు బద్దలు కొట్టడానికి రీ రిలీజ్
ఏప్రిల్ 26న థియేటర్లో విడుదలైన తరువాత, అవెంజర్స్: ఎండ్‌గేమ్ జూలై 30న ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ పాం ద్వారా విడుదలైంది. అవతార్ రికార్డులను బద్దలు కొట్టడానికి చిత్రాన్ని మార్వెల్ సంస్థ రి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ అభిమానులు
మార్వెల్ కామిక్ యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ హీరోల సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఆదరణ పొందింది అవేంజర్స్ సిరీస్ చిత్రాలే. ది ఎండ్ గేమ్ చివరి మూవీ కావడంతో ప్రతి మార్వెల్ ఫ్యాన్స్ అందరూ మిస్సవ్వకుండా ఈ చిత్రం చూశారు.

రూ. 20 వేల కోట్లు...
‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' కలెక్షన్ లెక్కలు మన కరెన్సీలో చెప్పాలంటే... రూ. 20 వేల కోట్ల పైమాటే. ఈ మూవీని రూ. 2500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. పెట్టుబడికి పదింతలు రాబట్టడం ద్వారా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.