»   » అవేంజర్స్: ఇన్పినిటీవార్.....ఈ భారీ హాలీవుడ్ చిత్రానికి పని చేయబోతున్న రానా!

అవేంజర్స్: ఇన్పినిటీవార్.....ఈ భారీ హాలీవుడ్ చిత్రానికి పని చేయబోతున్న రానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ ప్రముఖ సిని నిర్మాణ సంస్థ 'మార్వెల్' నుండి వచ్చే భారీ యాక్షన్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నాయి. వరల్డ్ వైడ్ దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సంస్థ నుండి రాబోతున్న మరో సిరీస్ ' అవేంజర్స్ : ఇన్ఫినిటీ వార్' తెలుగులో కూడా విడుదల కాబోతోంది.

Avengers: Infinity War – Rana voices villains role in Telugu dub

ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు బాహుబలి స్టార్ రానా తన వాయిస్ అందించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో మైటీ థానోస్ పాత్రకు రానా తన గాత్రాన్ని అందించబోతున్నారు. థానోస్ అనేది ఇందులో విలన్ పాత్ర. ఈ మేరకు రానా డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని ఖరారు చేస్తూ మార్వెల్ ఇండియా విభాగం ప్రకటన విడుదల చేసింది.

'నేను మార్వెల్ కామిక్స్ చదువుతూ, సినిమాలు చూస్తూ పెరిగాను. మార్వెల్ సంస్థ ఎవరూ ఊహించని ఇలాంటి క్యారెక్టర్లు క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేస్తూ భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడం ఆ సంస్థకే చెల్లింది అని రానా గతంలో వెల్లడించారు.

Avengers: Infinity War – Rana voices villains role in Telugu dub

అవేంజర్స్: ది ఇన్ఫినిటీ వార్ చిత్రానికి జో రుస్సో, ఆంటోనీ రుస్సో దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, థోర్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరో క్యారెక్టర్లు అద్భుత సాహస విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతున్నాయి.

English summary
Rana voices villain's role in Telugu dub version of Avengers: Infinity War. The studio has confirmed that a Telugu dubbed movie will hit the cinemas and they have tapped upon a renowned Baahubali star to voice over for a crucial role in the movie. The studio recently revealed that Baahubali star Rana Daggubati is voicing the role of the mighty Thanos in the Avengers: Infinity War's Telugu dubbed version. Thanos is the villain of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X