»   » ఈ ట్రైలర్ చూశారా? హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి!

ఈ ట్రైలర్ చూశారా? హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి !

తెలుగు నటి, నిర్మాత మంచు లక్ష్మి గతంలో అమెరికాలో ఉన్నపుడు పలు హాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇండియాకి వచ్చి సెటిలైన తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయారు. చాలా కాలం తర్వాత మంచు లక్ష్మి మళ్లీ ఓ హాలీవుడ్ చిత్రంలో నటించింది.

బాస్మతి బ్లూస్

హాలీవుడ్లో ‘బాస్మతి బ్లూస్‌' అనే చిత్రం తెరకెక్కింది. ఇండియాలో పండించే వరి ధాన్యం కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో మంచు లక్ష్మి ఉన్న సీన్లు కూడా చూడొచ్చు.

మంచు లక్ష్మి ట్వీట్

తన హాలీవుడ్ సినిమా విశేషాలను మంచు లక్ష్మి ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘నా కొత్త హాలీవుడ్‌ సినిమా త్వరలో విడుదల కాబోతోంది' అంటూ ట్వీట్ చేశారు.

ముఖ్య పాత్రలు

ముఖ్య పాత్రలు

ఈ చిత్రంలో బ్రీ లార్సన్‌, ఉత్కర్ష్‌ అంబుద్కర్‌, మంచు లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డాన్‌ బారన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. షౌట్‌ ఫ్యాక్టరీ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 సినిమా కథేమిటి?

సినిమా కథేమిటి?

ఓ విదేశీ ఓ శాస్త్రవేత్త తను జన్యుపరంగా మార్పు చేసిన వరి ధాన్యాన్ని భారత్‌కు తీసుకొచ్చి అమ్మాలనుకుంటుంది. దాని వల్ల ఇక్కడి రైతులకు దిగుబడి పెరిగి మరింత మేలు జరుగుతుందని ఆమె ఉద్దేశ్యం. ఈ క్రమంలో ఆమె ఇండియన్ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఆమె తీసుకొచ్చిన జన్యుమార్పిడి ధాన్యం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, రైతులకు మేలు జరిగిందా? లేదా? అనేది కథ.

 రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?

ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండియాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Basmati Blues is a musical comedy that follows Linda Watt , a sheltered but brilliant young scientist who is plucked out of her company’s lab and sent to India by her CEO (Donald Sutherland) to sell “Rice 9,” a genetically modified rice she’s created – unaware that the rice will destroy the Indian farmers she thinks she’s helping. Her life turns upside down as she discovers the truth and falls in love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X