»   » షూటింగ్ గ్యాప్ లో సహ నటితో సరదా, ప్రముఖ నటుడి ప్రాణాలు తీసింది

షూటింగ్ గ్యాప్ లో సహ నటితో సరదా, ప్రముఖ నటుడి ప్రాణాలు తీసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లాస్ ఏంజిల్స్ : కొన్ని సార్లు సరదాలు మనిషిని అంతు తెలియని తీరాలకు తీసుకు వెళ్తాయి. ఊహించని ప్రమాదాలు వెన్నంటే ఉంటాయని గుర్తించనప్పుడు మరణం దాన్ని గుర్తు చేస్తుంది. రీసెంట్ గా నదీ తీరంలో ఓ టీవి సీరియల్ షూటింగ్ జరుగుతుండగా గ్యాప్ లో.. ఓ నటితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన నటుడు దుర్మరణం చెందాడు. బ్రెజిల్ టీవీ రంగంలో టాప్ యాక్టర్ గా కొనసాగుతోన్న డొమింగోస్ మాంటెగ్నర్ అనూహ్యరీతిలో మృతిచెందిన ఉదంతం ఆ దేశంలో చర్చనీయాంశమైంది.


  బ్రెజిల్ దేశ లీగల్ మెడికల్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ జోస్ కార్దోస్ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బ్రెజిల్ లో పాపులర్ టీవీ సీరియల్ షూటింగ్ నిమిత్తం యూనిట్ తో డొమింగోస్ మాంటెగ్నర్ కలిసి గురువారం కానిండ్లే అనే గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామాన్ని ఆనుకునే సావ్ ప్రాన్సిస్కో నది ప్రవహిస్తూ ఉంటుంది.

  షూటింగ్ గ్యాప్ లో సహ నటి కామిల్లా పిటాంగాతో కలిసి డొమింగోస్ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇద్దరూ జలకాలాటలలో మునిగిఉండగా..ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. ఒక బండరాయిని ఆసరాగా చేసుకుని కామిల్లా తననుతాను కాపాడుకోగా.. డొమింగోస్ మాత్రం నీటిలో కొట్టుకుపోయారు.

  Brazilian actor Domingos Montagner drowns in river near set of TV show

  వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది డొమింగోస్ కోసం గాలింపుచర్యను చేపట్టారు. ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, అంటే శుక్రవారానికి డొమింగోస్ మృతదేహాం లభ్యమైంది. గల్లంతైన ప్రదేశానికి 1000 అడుగుల దూరంలో నీటి అడుగున 60 అడుల లోతులో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన డొమింగోస్ మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీశామని కార్దోస్ లీగల్ మెడికల్ అధికారి జోస్ చెప్పారు. నిజానికి వారు నదిలోకి దిగిన చోటు ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

  ఇక డొమింగోస్ తొ కలిసి ఈతకు వెళ్లి తృటిలో ప్రాణాలు చేజిక్కించుకున్న నటి కామిల్లా ప్రమాదాన్ని వివరిస్తూ..'సరదాగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా నీళ్లొచ్చాయి. ఇద్దరం కొట్టుకుపోయాం. అయితే నాకొక బండరాయి ఆసరా దొరికింది. దానిపైకి ఎక్కి డొమింగోస్ కు చెయ్యి అందించే ప్రయత్నం చేశా. రెండు సార్లు దాదాపు దగ్గరగా వచ్చినా లాభం లేకపోయింది'అని చెప్పారు. 54 ఏళ్ల డొమింగోస్ సర్కర్ కళాకారుడిగా ప్రారంభమై, నాటక రంగంలో రాణించి, ఆపై టీవీ రంగంలో పేరు సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

  English summary
  A popular Brazilian television star Domingos Montagner has drowned while swimming near a film set in north eastern Brazil. The body of Domingos Montagner was found 18 metres underwater and 320 metres from where he was last seen in the Sao Francisco River, near the town of Caninde in Sergipe state.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more