»   » స్టార్ కామెడీ హీరో,డైరక్టర్, రచయిత మృతి, నివాళి

స్టార్ కామెడీ హీరో,డైరక్టర్, రచయిత మృతి, నివాళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రముఖ కామెడీ హీరో జెని వైల్డర్ మృతి చెందారు. ఛాక్లెట్ ఫ్యాక్టరి, విల్లీ వోండ్కా వంటి చిత్రాలతో ఫేమస్ అయిన ఈ కమిడయన్ తన 83 యేట తుది శ్వాస విడిచారు. స్టామ్ ఫోర్డ్ లోని తన సొంత ఇంట్లో మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాదపడుతున్నారు.

ఆయన మేనల్లుడు బాధపడుతూ...ఆయన ఈ వ్యాధితో ఎమోషనల్ గా ఫిజికల్ గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయనకు క్లోజ్ గా ఉన్నవారినిసైతం ఆయన గుర్తించలేకపోయేవారు. ఆయన మరణం ఓ రకంగా ఆయనకీ సమస్య నుంచి విముక్తి ఇచ్చినట్లే. ఆయన లేరు అన్నది బౌతికంగానే కానీ , చాలా మంది హాస్య ప్రియులు, పిల్లల హృదయాల్లో ఆయన ఎప్పుడూ బ్రతికే ఉన్నారు.

Comic Icon And Willy Wonka Star Gene Wilder Dies At 83

ఆయన ఈ వ్యాధితో ఇబ్బంది పడుతూ ప్రయాణాలకు భయపడేవారు. చాలా కన్ఫూజ్ అయ్యేవారు. దారులు గుర్తుండేవి కాదు. అయితే ఆ సమయంలో కూడా ఆయన పెదాలపై చిరునవ్వు ఉండేది. దాన్ని మాత్రం ఆ వ్యాధి దూరం చేయలేకపోయింది అని ఆయన మేనల్లుడు ఇచ్చిన స్టేట్ మెంట్ పేర్కొన్నాడు.

జెని వైల్డర్ రెండు సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు. సీజనల్ స్టేజ్ ఏక్టర్ కూడా, అంతేకాదు ఆయన నవలలు కూడా రాసారు. స్క్రీన్ ప్లే రాసారు, డైరక్ట్ చేసారు. అలా అన్ని రంగాల్లో ఆయన సకల కళావల్లభుడు అనిపించుకున్నారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.

Read more about: డైరక్టర్
English summary
Gene Wilder, who had emerged to be one of America's most prominent actors, and comedian, known for his iconic role in Willy Wonka and the Chocolate Factory died at the age of 83, in his residential house in Stamford, Connecticut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu