Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
75th Cannes Film Festival భారత్‌కు అరుదైన గౌరవం.. అక్షయ్ కుమార్ డుమ్మా.. ఏం జరిగిందంటే?
ప్రపంచ సినిమా పండుగగా పేర్కొన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. 75వ కేన్స్ ఫిలింఫెస్టివల్ కోసం భారతీయ సినిమా తారలు ఫ్రాన్స్‌కు చేరుకొన్నారు. ఈ వేడుకల్లో మార్చ్ ది సినిమాలో భారతదేశానికి అరుదైన గౌరవం దక్కింది. తొలి రోజున కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌తో కలిసి ఏఆర్ రెహ్మాన్, పూజా హెగ్డే, శేఖర్ కపూర్, తదితరులు రెడ్ కార్పెట్‌పై అడుగులు వేయనున్నారు. ఈ వేడుకల్లో అక్షయ్ కుమార్ కూడా పాల్గొనాల్సి ఉండగా... ఆయన కోవిడ్ పాజిటివ్ కారణంగా దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేసి.. అనురాగ్ థాకూర్.. మీ అందరిని మిస్ అవుతున్నాను అని అన్నారు.
2022లో జరిగే కేన్స్ ఉత్సవాలల్లో ఆరు భారతీయ సినిమాలను ప్రదర్శించనున్నారు. వాటిలో రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్, గోదావరి (మరాఠీ), ఆల్ఫా బీటా, గామా (హిందీ, బొంబా రైడ్ (మిషింగ్), దుని (మైతిలీ) నిరాయే థతకాలుల్ల మారమ్ (మలయాళం) చిత్రాలు ఉన్నాయి.

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పదుకోన్‌కు అరుదైన ఘనతను చేజిక్కించుకొన్నది. ఈ ఏడాది ఈ ఫెస్టివల్‌కు జ్యూరీగా వ్యవహరించనున్నారు. జ్యూరీగా ఎంపిక చేయడంపై ఇది నా వ్యక్తిగత విజయం అని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాసియాకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.
ఇక కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఫ్రాన్స్ వెళ్లారు. ఐశ్యర్య, పూజా హెగ్డే ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు ఫోజిస్తూ కనిపించారు.
మార్చ్ ద ఫిల్మ్ ఫెస్టివల్ డి కేన్స్‌లో భారత్‌కు అరుదైన గౌరవం దక్కడంపై ప్రధాని మోదీ ఇటీవల హర్షం ప్రకటించారు.