»   » గాసిప్ గర్ల్ షో గెస్టుగా క్రికెటర్ షేన్‌వార్న్ ప్రియురాలు

గాసిప్ గర్ల్ షో గెస్టుగా క్రికెటర్ షేన్‌వార్న్ ప్రియురాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రిటీష్ హీరోయిన్, క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ప్రేయసిరాలు ఎలిజిబెత్ హార్లే త్వరలో అమెరికాలో బాగా పాపులారిటీని సంపాదించిన 'గాసిప్ గర్ల్' అనే షోలో సెక్సీ మీడియో మొగల్‌గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అమెరికాలో మంచి పాపులారిటీని తెచ్చుకున్నటువంటి షోలలో గాసిప్ గర్ల్ షో ఒకటి. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఐదవ సిరిస్ త్వరలో ఫ్రారంభం కానుంది. టివి లైవ్ కధనం ప్రకారం గాసిప్ గర్ల్ అనే షోలో ఎలిజిబెత్ హార్లే డైనా పేనీ అనే పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఈ షోలో ఎక్కువ ఎపిసోడ్స్‌లో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ఈ సందర్బంలో గాసిప్ గర్ల్ ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్స్ స్టీఫానై సావేగా, జాషువా సాఫ్రాన్ మాట్లాడుతూ ఈ షోలో ఎలిజిబెత్ క్యారెక్టర్ చాలా సెక్సీగా, అందంగా, మీడియా మొగల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ క్యారెక్టర్‌తో ఎలిజిబెత్ హార్లేకి మంచి పేరు రావడమే కాకుండా గాసిప్ గర్ల్ షో కి కూడా మంచి పేరు తెస్తుందని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. డైనా షేనీ ఒక్కసారిగా సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో గాసిప్ గర్ల్‌లో ఉన్నటువంటి మిగతా క్యారెక్టర్స్ కూడా ఒక్కసారిగా మారిపోతాయని అన్నారు. ఎలిజిబెత్ మాటతీరు, ఆమె అందం, తెలివితేటలు అన్ని కూడా గాసిప్ గర్ల్‌కు చాలా చక్కగా సరిపోతాయనే ఉద్దేశ్యంతోనే ఆమెని తీసుకోవడం జరిగిందని అన్నారు. ఆమె గాసిప్ గర్ల్‌లో నటించడం నిజంగా మా అదృష్టం అని అన్నారు.

ఇది ఇలా ఉంటే బికిని భామ ఎలిజబెత్ హార్లే తన భర్త ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం అరుణ్ నాయర్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్‌తో డేటింగ్ చేస్తుంది. డేటింగ్ చేయడమే కాకుండా ఇటీవల ఇండియాలో జరిగినటువంటి ఐపిఎల్ 4లో రాజస్దాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్‌గా షేన్ వార్న్ ఉన్నప్పుడు ఇండియాకి వచ్చి రాజస్దాన్ రాయల్స్ టీమ్‌ ప్లేయర్స్ చక్కగా ఆడాలని తనవంతు సహాకారన్ని అందించింది. తన భార్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత అరుణ్ నాయర్ కిమ్ జాన్సన్ తో సంబంధం కోనసాగిస్తున్నారని వినికిడి. ఇది మాత్రమే కాకుండా వెస్ట్ లండన్ లోని కెనిసగ్టంన్ లోని లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఇద్దరూ కలసి మూడు రాత్రులు గడిపారని, ఇందులో భాగంగా వీరిద్దరి మద్య ముద్దులు పర్వం కోనసాగిందని అంటున్నారు.

English summary
British actress Elizabeth Hurley is all set to join the cast of the hit American show ‘Gossip Girl’ as a sexy, smart and self-made media mogul.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu