»   » అతనితో నా ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిందన్నడాన్సింగ్ హీరోయిన్

అతనితో నా ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిందన్నడాన్సింగ్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్పైసీ గర్ల్ ఎమ్మా బుర్టన్ తనతో ఎప్పటినుంచో సంబంధం కోనసాగిస్తున్నటువంటి పార్టనర్ జేడి జోన్స్‌ తో‌ ఎంగేజ్ మెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. డాన్సింగ్ ఆన్ ఐస్ షో ద్వారా పరిచయమైనటువంటి ఎమ్మా బుర్టన్ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మొన్న జరిగినటువంటి డాన్సింగ్ ఆన్ ఐస్ షోలో తను ప్రవర్తించినటువంటి తీరు అందరికి చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి కారణం ఎమ్మా బుర్టన్ తన చేతికి పెద్ద వెడ్డింగ్ రింగ్ మాదిరి పెద్ద రింగుని ధరించి షో మొత్తం కలకలం సృష్టించారు. అంతేకాకుండా షోకు పెట్టుకొచ్చినటువంటి వెడ్డింగ్ రింగ్‌ని పోటోలు తీయడానికి అక్కుడున్నటువంటి పోటోగ్రాఫర్స్ పోటీలు పడ్డారు.

ఇది మాత్రమే కాకుండా ఎమ్మా బుర్టన్ తన ట్విట్టర్ పేజిలో తన అభిమానులు అందరికి ఓ అద్బుతమైన కొత్త విషయాన్ని ట్వీట్ చేయడం జరిగింది. ఆకొత్త విషయం ఏమిటంటే యాహూ నేను కూడా ఎంగేజ్ అయ్యాను అది ఎవరితోనంటే నాపార్టనర్ జేడ్, ఐలవ్ యూ జేడ్, నేను ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే తన ముప్పయి అయిదవ పుట్టినరోజున బాయ్ బ్యాండ్ స్టార్ జేడ్ జోన్స్ తనకి ప్రపోజ్ చేయడం, వెంటనే ఎమ్మా బుర్టన్ కూడా ఒప్పేసుకోవడం క్షణాలలో జరిగిపోయాయంటూ ఆమె ట్వీట్ చేశారు.

నాజీవితంలో నేను మరిచిపోలేనటువంటి పుట్టినరోజుగా దీనిని జరుపుకుంటున్నానని తెలిపారు. ఎమ్మా బుర్టన్‌కి జేడి జోన్స్‌కు అంతకు ముందే మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి కొడుకు ఉండగా, త్వరలో మరోక బేబికి జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నామంటూ ఈజంట తెలియజేశారు.

English summary
Emma Burton has announced that she’s engaged to long-term partner Jade Jones. The former Spice Girl, 35, broke the news live on ‘Dancing On Ice.’ She made the revelation to her show co-stars and judges during a commercial break - and brandished a huge diamond ring to the cameras and viewers at home when the show returned. Yahooooo I'm Engaged! Love you Jade! I''m a very happy lady (sic)!" Burton wrote on her Twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu