»   » ఇండియాలో 100 కోట్లు: తొలి హీలీవుడ్ మూవీ ఇదే..

ఇండియాలో 100 కోట్లు: తొలి హీలీవుడ్ మూవీ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలివుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడే ఇండియన్ సినీ ప్రేమికులు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఏప్రిల్ 2న విడుదల కావడంతో సినీ అభిమానులంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ చిత్రం గతంలో ఏ హీలీవుడ్ సినిమా సాధించని విధంగా తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించింది. అంతే కాకుండా తాజాగా.... ఇండియాలో రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి హాలీవుడ్ మూవీ కావడం విశేషం.

Fast & Furious 7

హాలీవుడ్ తారాగణం పాల్‌వాకర్,విన్ డీజిల్,డ్వానే జాన్స్‌సన్, జేసన్ స్టాతమ్, మిచెల్లీ రోడ్రిగేజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల మార్కును దాటింది. ఈ నెల 2న 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్7 వసూళ్లు అదరగొడుతోంది.

సినిమా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, పట్టణాల్లో 2800 థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుందని యూనివర్సల్ ఫిక్చర్స్ ఇండియా జనరల్ మేనేజర్ సరబ్‌జిత్ సింగ్ తెలిపారు.

English summary
Hollywood action-thriller "Fast & Furious 7" has raced to the top of the box office, picking up a massive Rs.100 crore in its first week in India.
Please Wait while comments are loading...