»   » ఇపుడు వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా?

ఇపుడు వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్‌గా ఎంపికైంది. ప్రముఖ బ్రిటిష్ మెన్స్ మేగజైన్ 'ఎఫ్‌హెచ్‌ఎం' విడుదల చేసిన 2014 టాప్ 100 హాటెస్ట్ గ్లోబల్ గర్ల్స్ లిస్టులో జెన్నిఫర్ లారెన్స్ మొదటి స్థానం దక్కించుకుంది. సర్వే ద్వారా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ ఈ లిస్టు విడుదల చేసింది.

తనకు మొదటి స్థానం దక్కడంపై జెన్నిఫర్ లారెన్స్ స్పందిస్తూ... 'నాకు ఈ స్థానం కట్టబెట్టినందుకు ఎఫ్ హెచ్ ఎం రీడర్స్‌కు ధన్యవాదాలు. నా దృష్టిలో సెక్సీనెస్ అంటే హేవీ మేకప్, పర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్, శరీరాకృతి కాదు....సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదే నా దృష్టలో సెక్సీనెస్. మీకు మీరు కంఫర్టబుల్‌గా, సంతోషంగా ఉన్నపుడే సెక్సీనెస్ వస్తుంది' అని జెన్నిఫరల్ లారెన్స్ తెలిపారు.

FHM's 100 Sexiest Women: Jennifer Lawrence crowned world winner

ఇక జెన్నిఫర్ లారెన్స్ తర్వాతి స్థానంలో ఇంగ్లిష్ హీరోయిన్ మిచెల్లీ కీగన్ నిలిచారు. గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్న రిహానా ఇపుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక కేలే కూకో ఒక స్థానం ఎగబాకి ఐదో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం విజేతగా నెం.1 స్థానం దక్కించుకున్న మిలా కునిస్ ఇపుడు ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక టాప్ 10 లిస్టులో హాలీవుడ్ బ్యూటీ బియాన్స్ నోలెస్, స్కార్లెట్ జాన్స్ నిలిచారు.

English summary
Hollywood star Jennifer Lawrence has been named the sexiest woman in the world, topping the annual countdown of the top 100 by FHM magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu