»   » శృంగారం శృతిమించింది: అక్కడ నిషేదం, ఇక్కడ వాయిదా

శృంగారం శృతిమించింది: అక్కడ నిషేదం, ఇక్కడ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ గ్రే'....ఇటీవల విడుదలైన శృంగార భరిత రొమాంటిక్ హాలీవుడ్ మూవీ. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ప్రస్తుతానికి ఈ చిత్రం అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో మాత్రమే విడుదలైంది. ఇండియాతో పాటు, గల్ఫ్ కంట్రీస్, ఇతర చోట్ల ఇంకా విడుదల కాలేదు.

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తు UAE వాసులకు బ్యాడ్ న్యూస్. ‘స్ట్రాంగ్ సెక్స్ అండ్ న్యూడిటీ' కంటెంట్ ఉండటం వల్ల ఈ చిత్రాన్ని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేదించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని కెన్యా, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో బ్యాన్ చేసారు. అయితే ఇండియాలో మాత్రం ఈ చిత్రం సెన్సార్ ఇష్యూ కారణంగా విడుదల వాయిదా వేసారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Fifty Shades Banned In UAE, India's Release Date Postponed

ఈ చిత్రానికి ఒక్కో దేశం ఒక్కోలా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. సెక్స్ కంటెంట్ చాలా తీవ్రంగా ఉందని, గాఢమైన శృంగార సన్నివేశాలు ఉన్నాయని, నగ్న సన్నివేశాలు టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయని బిట్రిష్ సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని పెద్దలకు మాత్రమే పరిమితం చేసింది. అయితే యుఎస్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ మాత్రం మరోలా ఉంది. ఈ చిత్రాన్ని 17 ఏల్ల లోపు వారు కూడా పెద్దల సమక్షంలో చూడొచ్చని పేర్కొంది.

ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుండే అందరిలో ఆసక్తిని పెంచింది. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' ట్రైలర్ కూడా ఓ సంచలనే సృష్టించింది. హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ ట్రైలర్ రొమాంటిక్ సీన్లతో హీట్ పుట్టించే విధంగా ఉంది. సినిమా కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది.

ఈ చిత్రం ఇఎల్.జేమ్స్ రాసిన నవల ‘ఫిఫ్టీ షేట్స్ ఆఫ్ గ్రే' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు. రొమాంటిక్, ఎరోటిక్ అంశాలతో సాగే ఈ నవల అప్పట్లో మార్కెట్లో బాగా అమ్ముడు పోయింది. ఆ నవలలోని పాత్రలనే సినిమా రూపంలో హాట్ అండ్ సెక్సీగా తెరకెక్కించాడు దర్శకుడు సామ్ టైలర్ జాన్సన్.

మికుల రోజు సందర్భంగా విడుదల కావడం, వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో వసూళ్ల పంట పండింది. 239 మిలియన్ డాలర్ల(రూ. 1500 కోట్లు)కుపైగా వసూలు చేసింది. హాలీవుడ్ సినిమాల చరిత్రలో ఇదో రికార్డు. ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 81.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

English summary
Sad news for Fifty Shades of Grey fans in the UAE. The Erotic-romance starring Jamie Dornan and Dakota Johnson, has been banned in UAE owing to its intimate scenes.
Please Wait while comments are loading...