»   » బడ్జెట్ 250 కోట్లు...వసూళ్లు రూ. 3వేల కోట్లు!

బడ్జెట్ 250 కోట్లు...వసూళ్లు రూ. 3వేల కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలై హాలీవుడ్ శృంగార భరితమైన ప్రేమకథా చిత్రం. హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ రొమాంటిక్ సీన్లతో యువతలో హీట్ పుట్టించే విధంగా ఉంది.

వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ హాట్ మూవీ అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం దాదాపు 40 మిలియన్ డాలర్ల(రూ. 250 కోట్లు) బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 500 మిలియన్ డాలర్లు(రూ. 3వేల కోట్లకు పైగా) వసూలు చేసింది.

అయితే ఈచిత్రం మన దేశంలో విడుదల కాలేదు. సెక్స్ కంటెంట్ తీవ్రంగా ఉండటంతో ఇండియాతో పాటు... మలేషియా, దుబాయ్, అరబ్ దేశాలు, కెన్యా, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేసారు. కాగా... అమెరికా, యూరఫ్, ఇతర దేశాల్లో ఈచిత్రం వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాల పంట పండించింది. త్వరలో ఈ చిత్రం డీవీడి కూడా మార్కెట్లోకి తేబోతున్నారు. ఇందులో సినిమాలో జతచేయని మరిన్ని హాట్ సీన్లు కూడా ఉండబోతున్నాయట. మే 1 నాటికి డిజిటల్ హెడ్.డి ప్రింట్లు, బ్లూరే ఫ్లింట్లు మే 8 నాటికి అందుబాటులోకి రానున్నాయి.

Fifty Shades of Grey collected $500 millions

శృంగార భరితమైన ఈ ప్రేమకథా చిత్రం....ప్రేమికులను తెగ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇందులో ఉండే రొమాంటిక్ సీన్లు చూడటానికే థియేటర్లకు వెలుతున్నారట. ఇక మరిన్ని హాట్ సీన్లు కలిపిన డీవీడీలు మార్కెట్లోకి వస్తే అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇండియాలో ఎందుకు బ్యాన్ చేసారంటే...సినిమాలో ఎక్కువగా నగ్న సీన్లు ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి వాటికి స్థానం లేదు. ఈ చిత్రంలో హీరోయిన్ టాప్ లెస్ ప్రదర్శన ఉంది. సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఇలాంటివి అనుమతించరు. సినిమాలో అభ్యంతర కర సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకే బ్యాన్ చేయక తప్పలేదు. సినిమాలో శృంగార సీన్ల తీవ్రత ఎక్కువగా ఉంది.

English summary
Released worldwide on 13th February on the eve of Valentine's Day, Universal Studios' most erotic production ever, Fifty Shades of Grey, has been setting the box office across the world on fire. Made on a meager budget of $40 millions, the film has so far collected $500 millions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu