Just In
- 33 min ago
ముగిసిన కాపటధారి పోరాటం: సుమంత్ కెరీర్ మొత్తంలోనే ఊహించని కలెక్షన్స్..!
- 48 min ago
నెటిజన్ ప్రశ్నకు సరైన రిప్లై.. బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టేసిన ఇలియానా
- 1 hr ago
కంటతడి పెట్టిన కంగన రనౌత్.. భోరున ఏడ్వడంపై సిబ్బంది ఎమోషనల్
- 1 hr ago
ఒకే రోజు రెండు సినిమాలు.. రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్న పవర్ స్టార్
Don't Miss!
- News
bengal polls: కాంగ్రెస్-లెఫ్ట్ సభకు భారీగా జనం -నేతల మధ్య సమన్వయ లోపం -ఓట్లు రాలేనా?
- Sports
పొట్టకూటి కోసం డ్రైవర్‌గా మారిన సీఎస్కే మాజీ స్పిన్నర్!
- Automobiles
గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే కొత్త బజాజ్ ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్
- Finance
ఇన్సురెన్స్ ప్రీమియం ముందుగా చెల్లిస్తే ఆఫర్, ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు
- Lifestyle
అతను 30 ఏళ్లుగా వధువు దుస్తుల్లోనే... కారణం తెలిస్తే షాకవుతారు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యువ హీరోయిన్‌కు వికటించిన ప్లాస్టిక్ సర్జరీ.. చికిత్స తర్వాత ఏం జరిగిందంటే..
అత్యాశతో అనవసరపు సర్జరీకి పోయి కొంతమంది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ వలన ప్రాణాలు మీదకు కూడా తెచ్చుకున్నారు. ఇక రీసెంట్ గా మరో సెలబ్రేటి కూడా అదే తరహాలో ఉన్న అందాన్ని చెడగొట్టుకుంది. ఆమె మరెవరో 24 ఏళ్ల చైనా స్టార్, గావో లియు. గావో సింగర్ గానే కాకుండా నటిగా అనేక చైనీస్ చిత్రాల్లో కనిపించింది.

స్కిన్ మొత్తం డెడ్ అవ్వడం వల్ల..
ఇక బోట్డ్ కాస్మెటిక్ సర్జరీ వికటించడంతో ఆ తరువాత తన ముక్కు పాడైపోయిందని ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. స్కిన్ మొత్తం డెడ్ అవ్వడం వల్ల ఆమె రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది. ముక్కు మొత్తం నల్లబడిపోవడంతో ఆమె తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.

ఇన్ఫెక్షన్ కారణంగా
బావోడ్ కాస్మెటిక్ సర్జరీ వికటించడంతో పాటు గావో దాని ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు యొక్క నెక్రోసిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పుకుంది. అంతే కాకుండా సర్జరీ చేయించుకున్న చైనా హాస్పిటల్ వివరాలను కూడా ఆమె బయటపెట్టారు. శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రమాదం గురించి తన 5 మిలియన్ల ఫాలోవర్స్ ను ఆమె హెచ్చరించింది.

గంటల తరబడి సర్జరీ
దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌలోని జి షి షి గువాంగ్ క్లినిక్‌లో ఆమె ముక్కు రూపురేఖలు మార్చాలని సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించింది గావో. ఈ ఆపరేషన్ సుమారు నాలుగు గంటలు కొనసాగిందని ఈ సమయంలో వైద్యులు ఆమె శరీరం నుండి మృదులాస్థిని తీసివేసి, ఆమె ముక్కును మార్చారు. అయితే ఆ నాలుగు గంటల సర్జరీ ఇప్పుడు ఒక పీడకల ప్రారంభమవుతుందని నేను ఉహీంచలేదు.. అని ట్విట్టర్ లో ఆమె పేర్కొంది.

దెబ్బతిన్న మార్కెట్
అయితే తన నటనా వృత్తిని మెరుగుపర్చడానికి శస్త్రచికిత్స ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని తాను అనుకున్నట్లు గావో చెప్పారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవ్వడంతో ఆమె అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక పదేపదే తదుపరి శస్త్రచికిత్సలు అవసరమని కూడా గావో చెప్పారు. ఇక గావో రెండు నెలలు ఆసుపత్రిలో ఉండడంతో ఆమె మార్కెట్ బాగా దబ్బతింది. జిబిపి కరెన్సీ 45,200 కోల్పోయినట్లు సమాచారం. అంతే కకుండా కాంటాక్ట్ ఒప్పందాలను బ్రేక్ చేయడంతో అదనంగా 225,621 జిబిపిను చెల్లించాల్సి ఉంటుందట.