twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మడోన్నా మరో ఇద్దరికి అమ్మ.. చాలా హ్యాపీగా ఉంది..

    ఇటీవల ఇద్దరు కవల పిల్లలను దత్తత తీసుకొన్నట్టు అధికారికంగా హాలీవుడ్ నటి మడోన్నా ప్రకటించారు. దాంతో రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఉదాత్త కథానాయకురాలినని ఆమె నిరూపించారు.

    By Rajababu
    |

    తోటివారిపై ప్రేమ, నా అనే వారు లేనివారిపై కరుణ, జాలి దయ చూపించడంలో సినీతారలు వెండితెరకే పరిమితమవుతారు. సినీతారల్లో కొందరికి భిన్నంగా హాలీవుడ్ నటి మడోన్నా పలువురికి మార్గదర్శకంగా నిలిచారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరోయిన్‌నే అని ఆమె నిరూపించారు. ఇటీవల ఇద్దరు కవల పిల్లలను దత్తత తీసుకొన్నట్టు అధికారికంగా ప్రకటించారు.

     అనాథ కవలలను దత్తత తీసుకొన్న మడోన్నా

    అనాథ కవలలను దత్తత తీసుకొన్న మడోన్నా


    ‘మలవీలోని ఓ అనాధ శరణాలయం నుంచి ఇద్దరు కవలలను దత్తత తీసుకొన్నాను. దత్తతకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. అక్కాచెల్లెల్లు మా ఇంట్లో సభ్యులు కావడం చాలా సంతోషంగా ఉంది. అనాథ పిల్లలకు గొప్ప జీవితం ప్రసాదించాలన్న నా కలకు సహకారమందించిన వారందరికి నా ధన్యవాదాలు' అని మడోన్నా పేర్కొన్నది.

     ప్రైవసీకి భంగం కలిగించొద్దు

    ప్రైవసీకి భంగం కలిగించొద్దు


    ‘దత్తత అంశాన్ని అతిగా ప్రచారం చేయవద్దు. ఈ విషయంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించవద్దని వేడుకొంటున్నాను. మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని వేడుకొంటాం. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, నా సిబ్బంది అందరికి థ్యాంక్స్' అని ఆమె వెల్లడించింది.

     ఐదు రోజుల వయస్సు నుంచే ..

    ఐదు రోజుల వయస్సు నుంచే ..


    ‘ఎస్తేరే, స్టెల్లే ఇద్దరు 5 రోజుల వయస్సు నుంచి నాలుగేండ్లు వచ్చేవరకు మలవీలోని హోం ఆఫ్ హోప్‌లో ఉన్నారు. ఇంకా అక్కడ 650 మంది అనాధలు ఉన్నారు. ఆ ఆశ్రమంతో 10 ఏండ్లుగా కలిసి పనిచేస్తున్నాను. ఎవరైనా ఆశ్రమానికి విరాళాలు అందించాలనుకుంటే Malawi.org వెబ్‌సైట్‌ను సంప్రదించండి. మీ పెద్ద మనుసుతో చిన్నారులను ఆదుకోండి' అని ట్విట్టర్‌లో ప్రజలకు మడోన్నా సూచించింది. 2014 లో డేవిడ్ అనే అనాధను దత్తత తీసుకొని కుమారుడిగా చేసుకొన్నది.

     అనాధలను మీరు ఆదుకోండి

    అనాధలను మీరు ఆదుకోండి


    దత్తత, విరాళాల గురించి ట్విట్టర్‌లో మడోన్నా పోస్ట్ చేసిన సందేశాలకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మీరందించిన స్ఫూర్తితో తాము కూడా అనాధలను ఆదుకొంటామని పలువురు స్పందించారు. తాము కూడా పిల్లలను దత్తత తీసుకొంటామని, విరాళాలు ఇవ్వడానికి కూడా సిద్ధమని వెల్లడించారు.

    English summary
    Pop star Madonna adopted twin girls from Malawi, announced on social media she was "overjoyed" to bring them into her family. She was granted permission by Malawi's High Court this week to adopt the twin girls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X