»   » నా వల్ల గర్భవతి అయింది, పెళ్లి బలవంతంగానే: జాకీ చాన్ సంచలనం

నా వల్ల గర్భవతి అయింది, పెళ్లి బలవంతంగానే: జాకీ చాన్ సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ జాకీ చాన్ తాను ఎలాంటి పరిస్థితుల్లో తన ప్రియురాలిని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో.... గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో పెద్దగా హైలెట్ కాని ఈ ఇంటర్వ్యూలోని సంచలన విషయాలు తాజాగా ఇంటర్నెట్ లో రీ సర్ఫేస్ అవుతుండటంతో ఇపుడు ఆ ఇంటర్వ్యూలోని విషయాలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి.

జాకీచాన్ తన ప్రియురాలు జోన్ లిన్‌ను 1982లో బలవంతంగానే వివాహం చేసుకున్నారట. అందు కారణం తన వల్ల ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చడమే అని చైనా ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకీ చాన్ తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో జాకీ చాన్ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్

చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్

ప్రస్తుతం జాకీచాన్ వయసు 63 సంవత్సరాలు. తాను యవ్వనంలో ఉన్నపుడు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు అని జాకీ చాన్ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు.

బలవంతంగా పెళ్లి

బలవంతంగా పెళ్లి

జోన్ లిన్ నా వల్ల పెళ్లికి ముందే గర్బం దాల్చింది. యాక్సిడెంటల్ గానే జైసీ జన్మించాడు. అసలు నాకు పెళ్లి ఆలోచనే ఉండేది కాదు. కానీ జోన్ లిన్ గర్భం దాల్చడంతో బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని జాకీ చాన్ తెలిపారు.

చైల్డ్ ఫ్యూచర్ కోసమే

చైల్డ్ ఫ్యూచర్ కోసమే

లిన్ ను తాను పెళ్లి చేసుకోవడానికి కారణం తమ చైల్డ్ ఫ్యూచర్ కోసమే... ఆ పరిస్థితులు తనను పెళ్లి వైపు ఫోర్స్ చేసాయి. అంతకు మించి మరేమీ కాదు... కాఫీ షాపులో రహస్యంగా మా వివాహం జరిగింది అని జాకీ చాన్ తెలిపారు.

ఎన్నో ఎఫైర్లు

ఎన్నో ఎఫైర్లు

లిన్ ను పెళ్లాడిన తర్వాత కూడా జాకీ చాన్ చాలా ఎఫైర్స్ నడిపాడనే రూమర్స్ ఉన్నాయి. బ్యూటీ క్వీన్ ఎలైన్ (Elaine Ng)తో అతడి ఎఫైర్ వల్లనే జాకీ కూతురు ఎట్టా (Etta Ng) 1999లో జన్మించిందని షాఘైకి చెందిన ఓ వైబ్ సైట్ ప్రచురించింది. కూతురుతో జాకీ సంబంధాలు ఇపుడు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

డగ్స్ వివాదంలో కుమారుడు

డగ్స్ వివాదంలో కుమారుడు

ఇక జాకీ చాన్ కుమారుడు జైసీ చాన్ 2014లో మాదక ద్రవ్యాలు తీసుకున్న కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.

English summary
Hollywood star Jackie Chan has confessed that he married his girlfriend Joan Lin (and now his wife) in 1982 after she got pregnant with their son, Jaycee. The news came to light after a 2015 interview suddenly resurfaced on the internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu