Don't Miss!
- News
వివేకా హత్యకేసులో సంచలనం- ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు: 11 గంటలకు..!!
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Avatar 3 కాన్సెప్ట్‌ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
ప్రపంచ సినిమా చరిత్రలో అవతార్ చిత్రం బాక్సాఫీస్ కింగ్‌గా మారింది. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఇటీవల రిలీజైన అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రం మరో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతున్నది. ఓ వైపు అవతార్ 2 సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసేందుకు సిద్దమవుతుండగా.. ఆ సినిమా దర్శక, నిర్మాత జేమ్స్ కామెరాన్ అవతార్ 3 సినిమాకు సంబంధించిన విషయాన్ని లీక్ చేశారు.
జేమ్స్ కామెరాన్ ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ 2023 వేడుకల్లో సందడి చేశారు. ఈ వేడుకలకు హాజరైన కామెరాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. RRR సినిమా యూనిట్‌ను ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ముచ్చటించారు. వారితో జేమ్స్ కామెరాన్ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

అయితే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ 2023 వేడుకల్లో జేమ్స్ కామెరాన్ మాట్లడుతూ.. అవతార్ 3 సినిమా కాన్సెప్ట్ గురించిన విషయాన్ని మీడియాతో పంచుకొన్నారు. పండోరా అనే గ్రహాన్ని సృష్టించిన ఆయన మూడో సీక్వెల్‌లో ఫైర్ అంటే నిప్పుతో చెలగాటం ఆడేందుకు సిద్దమవుతున్నట్టు చెప్పారు. ఫైర్ కాన్సెప్ట్‌తో అవతార్ తెరకెక్కిందని చెప్పారు.
అయితే అవతార్ 2 చిత్రం వాటర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అవతార్ చిత్రం ఐదు పార్టులుగా రాబోతున్నది. ఈ ఐదు పార్టుల్లో పంచభూతాలను చూపించబోతున్నారని స్పష్టమైంది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి కాన్సెప్ట్‌తో రానున్నాయి.
అవతార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లకు చేరువైంది. మరో బిలియన్ డాలర్లు వసూలు చేస్తే అవతార్ సినిమా రికార్డులను అధిగమిస్తుంది. అవతార్ చిత్రం 2024 డిసెంబర్‌లో రిలీజ్ కానున్నది.