»   » సూపర్ హిట్ ఉషారులో మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌... ఇంకోటి

సూపర్ హిట్ ఉషారులో మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌... ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌ తెరకెక్కించిన హాలీవుడ్‌ చిత్రం 'ది విజిట్‌' సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.33 కోట్ల బడ్జెట్‌తో హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఇప్పటి వరకూ రూ.502 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మనోజ్‌ మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇది కూడా 'ది విజిట్‌' తరహాలోనే లోబడ్జెట్‌ చిత్రమని తెలుస్తోంది. వచ్చే నెల్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 'ఎక్స్‌మెన్‌: డేస్‌ ఆఫ్‌ ప్యూచర్‌ పాస్ట్‌'లో ప్రొఫెసర్‌ ఎక్స్‌గా నటించిన మెకెవోయ్‌ను ఇందులో ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకొనే ఆలోచనలో ఉన్నారు మనోజ్‌. దీనికి సంబంధించి అతనితో సంప్రదింపులు జరుపుతున్నారు.

విజిట్‌ కథ:

రెబెకా, టేలర్‌ తమ అమ్మమ్మ డోరిస్‌, తాతయ్య జాన్‌ను చూసేందుకు వూరికెళ్తారు. అంతకు ముందు జాన్‌, డోరిస్‌ను వారు చూసి ఉండరు. వారిని స్టేషన్‌ నుంచి పిల్చుకొచ్చిన జాన్‌, ఇంటి బేస్‌మెంట్‌ కిందకు ఎప్పుడూ వెళ్లొద్దని, రాత్రి 9.30 తర్వాత తమ బెడ్‌రూమ్‌ నుంచి బయటకు రావద్దని వారికి చెబుతాడు. జాన్‌, డోరిస్‌ ప్రవర్తన విచిత్రంగా అనుమానాస్పదంగా ఉండటంతో వారు బేస్‌మెంట్‌లో కెమెరాను పెట్టి ఆన్‌ చేసి వస్తారు. ఆ తర్వాత అందులో ఉన్న దృశ్యాలు చూసి వణికిపోతారు.

James McAvoy joins M Night Shyamalan's next mystery project

డోరిస్‌ భయకరంగా అరుస్తూ కత్తి తీసుకుని తమ గది తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడం కెమెరాలో కనిపిస్తుంది. ఈ విషయం వారు తమ తల్లికి ఫోన్‌లో చెప్పి జాన్‌, డోరిస్‌ ఫొటోలు చూపిస్తారు. వారు తమ తల్లిదండ్రులు కాదని వెంటనే అక్కడి నుంచి వచ్చేయమని తల్లి చెబుతుంది. వారు ఇంటి నుంచి బయటకెళ్లకుండా జాన్‌, డోరిస్‌ అడ్డుపడతారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు బేస్‌మెంట్‌లో దాక్కున్న రెబెకా, టేలర్‌కు తమ అమ్మమ్మ, తాతయ్య శవాలు కనిపిస్తాయి. వారినెవరు చంపారు? రెబెకా, టేలర్‌ అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది 'ది విజిట్‌'లో భయంగొలిపేలా తెరకెక్కించారు మనోజ్‌.

James McAvoy joins M Night Shyamalan's next mystery project

బడ్జెట్ ...

రెండేళ్లకిందట 130 డాలర్‌ల బడ్జెట్‌తో, విల్‌ స్మిత్‌ హీరోగా తీసిన 'ఆఫ్టర్‌ ఎర్త్‌' చిత్రం అట్టర్‌ఫ్లాప్‌ దఅవటంతో, ఇంక ఆయన చాప్టర్‌ క్లోజ్‌ అనుకున్నారు అందరూ! అయితే, చిన్న బడ్జెట్‌లతో మంచి హిట్‌లను తీసే బ్లమ్‌హౌస్‌ ప్రొడక్షన్స్‌ వాళ్ళు ఆయనకు ఇంకో ఛాన్సు ఇచ్చారు. 'పెరానార్మల్‌ యాక్టివిటీ' , ' ఇన్‌సిడియన్‌ ' వంటి హిట్‌ చిత్రాలను తక్కువ బడ్జెట్‌ తీసిన సంస్థ అది. అతి తక్కువ లొకేషన్‌లతో, ఎక్స్‌ట్రాలు(జూనియర్‌ ఆర్టిస్టులు) నోరు తెరవకుండా (కాల్‌ షీట్‌ సమయానికి జూనియర్‌ ఆర్టిసులకు ఇచ్చేది 100 డాలర్లు మాత్రమే !

James McAvoy joins M Night Shyamalan's next mystery project

వాళ్ళు ఒక్క కాల్‌షీట్‌ సమయంలో ఒక్కమాట మాట్లాడినా 400 డాలర్‌ల అధిక పారితోషికం ఇచ్చి తీరాలనేది హాలివుడ్‌ రూలు, ) తక్కువ ఖర్చుతో సినిమా తీయాలనేది బ్లమ్‌ హౌస్‌ ప్రొడక్షన్‌ వాళ్ల పాలసీ, ఆ ప్రకారమే, మనోజ్‌ నైట్‌ శ్యామలన్‌ 'ది విజన్‌' సినిమాను కేవలం రెండే లొకేషన్‌లలో (పెన్సీల్వేనియాలో ఒక ఫార్‌మహౌస్‌లో, ఫ్రాలిడాలో ఒక హౌటల్‌ రూమ్‌లో) మాత్రమే షూట్‌ చేశాడు . ఇంక సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టులెవరూ నోరెత్తితే ఒట్టు!! ఖర్చు తక్కువ కాబట్టే, సినిమా నిర్మాతలకు డబ్బు చేసి పెడుతోందని పరిశీలకుల భావన.

English summary
James McAvoy has joined the cast of M Night Shyamalan's next mystery project. The actor signs on after Shyamalan was unable to tie up a deal for Joaquin Phoenix to star, Variety reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu