»   » శృతిమించిన శృంగారం: హీరోకు భార్య వార్నింగ్?

శృతిమించిన శృంగారం: హీరోకు భార్య వార్నింగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ గ్రే'....ఇటీవల విడుదలైన శృంగార భరిత రొమాంటిక్ హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ ట్రైలర్ రొమాంటిక్ సీన్లతో హీట్ పుట్టించే విధంగా ఉంది. సినిమా కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉంది.

విడుదలకు ముందు నుండే భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పడించింది. ఈ నేపథ్యంలో సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే సీక్వెల్‌లో నటించేందుకు 32 ఏళ్ల జామీ డోర్నన్ నో చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం జామీ డోర్నన్ భార్య అమేలియా వార్నర్ అని తెలుస్తోంది.

తన భర్తతో కలిసి డకోటా జాన్సన్ నటించిన సెక్స్ సీన్లు తెరపై చూసి ఆమె తట్టుకోలేక పోయిందని...తీవ్రమైన మనోవేదనకు గురైందని, సీక్వెల్ లో నటించొద్దని భర్తకు వార్నింగ్ ఇచ్చిందని హాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. భార్యకు ఇష్టం లేని పని చేయడం ఇష్టం లేక సీక్వెల్‌లో నటించేందుకు జామీ డోర్నన్ నో చెప్పినట్లు సమాచారం.

Jamie Dornan's wife doesn't approve of '50 Shades' sequel?

ప్రస్తుతానికి ఈ చిత్రం అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో మాత్రమే విడుదలైంది. ఇండియాతో పాటు, గల్ఫ్ కంట్రీస్, ఇతర చోట్ల ఇంకా విడుదల కాలేదు. సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా గల్ఫ్ కంట్రీలతో పాటు కెన్యా, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో బ్యాన్ చేసారు. అయితే ఇండియాలో మాత్రం ఈ చిత్రం సెన్సార్ ఇష్యూ కారణంగా విడుదల వాయిదా వేసారు.

ఈ చిత్రం ఇఎల్.జేమ్స్ రాసిన నవల ‘ఫిఫ్టీ షేట్స్ ఆఫ్ గ్రే' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు. రొమాంటిక్, ఎరోటిక్ అంశాలతో సాగే ఈ నవల అప్పట్లో మార్కెట్లో బాగా అమ్ముడు పోయింది. ఆ నవలలోని పాత్రలనే సినిమా రూపంలో హాట్ అండ్ సెక్సీగా తెరకెక్కించాడు దర్శకుడు సామ్ టైలర్ జాన్సన్.

ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కావడం, వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో వసూళ్ల పంట పండింది. 239 మిలియన్ డాలర్ల(రూ. 1500 కోట్లు)కుపైగా వసూలు చేసింది. హాలీవుడ్ సినిమాల చరిత్రలో ఇదో రికార్డు. ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం 81.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్లు 3 వేల కోట్లకు చేరుకుందని అంచనా.

English summary
Jamie Dornan may not be back as dashing Christian Grey in ' Fifty Shades of Grey' sequel. According to the sources, the 32-year-old actor has already spoken to film bosses and informed them that he won't be returning. The reason being, his wife Amelia Warner was not impressed with the hot and heavy sexual scenes the star shared with his co-star Dakota Johmson, the Daily Express reported.
Please Wait while comments are loading...