ప్రతీకారం తీర్చుకొనే ‘ఒక్క వీరుడు’ వస్తున్నాడు..
జాసన్ మమో, రేచల్ నిఖోల్ ముఖ్యతారలుగా హాలీవుడ్ లో రూపొందిన 'కొనాన్ ది బార్బేరియన్" చిత్రం ఈ నెలాఖరుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్కస్ నిస్పెట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ 'ఒక్క వీరుడు"ను హీరా ఫిలింస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా హీరా ఫిలింస్ అధినేత శరద్ జోషి మాట్లాడుతూ 'ఊహ కూడా తెలియని వయసులో తన తండ్రిని అత్యంత కిరాతంగా చంపడమే కాకుండా.. తమ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసి, తమ తెగకు చెందినవారందర్నీ తెగనరికి చంపినవారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడనేది ఈ చిత్ర కథాంశం. హీరోని నేరుగా ఎదుర్కోలేక విలన్లు తాంత్రిక శక్తులను ఉపయోగించినప్పుడు హీరో ఆ శక్తుల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. 400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మాణమైన ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తప్పకుండా చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం వుంది" అన్నారు.


Click it and Unblock the Notifications











