»   » దివాళా తీసిన స్టార్ హీరో : నెలకు 13 కోట్లు పైగా ఖర్చు, తాగుడుకే ఇరవై లక్షలు

దివాళా తీసిన స్టార్ హీరో : నెలకు 13 కోట్లు పైగా ఖర్చు, తాగుడుకే ఇరవై లక్షలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఎంత సంపాదించినా, ఖర్చు కంట్రోల్లో లేకపోతే పరిస్దితి ఏమిటి..రోడ్డుపై పడటమే. ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం 'పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌' ఫేం జానీ డెప్‌ పరిస్దితి అలాగే ఉంది. ఆర్దిక ఇబ్బందులతో ఆయన ఏం చేయాలో అర్దం కానీ పరిస్దితుల్లో ఉన్నారని హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ మధ్యన భార్యని చంపాలనుకున్నాడని వార్తల్లోకి ఎక్కిన డెప్ ఇప్పుడు ఈ ఆర్దిక ఇబ్బందులతో మరోసారి మీడియాలో మెయిన్ హెడ్డింగ్ గా మారారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...జానీ డెప్ నెలసరి ఖర్చు అక్షరాలా రూ.13.5 కోట్లట. ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన జానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దాంతో ది మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌(టీఎంజీ) నుంచి తన మేనేజర్లను తొలగించి కంపెనీపై కేసు పెట్టాడు జానీ. అయితే టీఎంజీ రివర్స్‌లో జానీపై కేసు పెట్టింది.

జానీ నెలకు 2 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేస్తూ తన చేతులారా ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఫిర్యాదులో జానీడెప్‌ నెలకు అయ్యే బడ్జెట్‌ విషయాలన్నీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా జానీకి 75 మిలియన్‌ డాలర్లు అంటే రూ.500 కోట్లు విలువైన 14 విల్లాలున్నాయి. 120 కోట్ల రూపాయలతో150 అడుగుల నౌక కొనుగోలుచేశాడు.

ప్రతి నెలా 20 లక్షలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యాన్ని దిగుమతి చేయించుకుంటాడు. టీఎంజీ నుంచి డెప్‌ 5 మిలియన్‌ డాలర్ల లోను తీసుకుని తిరిగి ఇవ్వడానికినిరాకరించాడని, కానీ తన ఆర్థిక ఇబ్బందులకు కంపెనీయే కారణమని సంస్థపై కేసు పెట్టాడని టీఎంజీ తెలిపింది.

Johnny Depp's money worries blamed on $2m-a-month lifestyle

గత 17 ఏళ్లుగా కంపెనీ డెప్‌కి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుందని కానీ డెప్‌తన చేతులారా ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడని పేర్కొంది. డెప్‌ లోన్‌ తీసుకున్నప్పుడు అది తీర్చలేకపోతే అతని పరువుపోతుందని కంపెనీనే అతనికి లోన్‌ ఇచ్చి సాయం చేసిందని టీఎంజీ యాజమాన్యం పేర్కొంది.

ఇక కొద్ది కాలం క్రితం...52 ఏళ్ల డెప్‌ నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ అంబర్‌ (30) కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబర్ స్నేహితుడు కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు.

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన డెప్‌ తన భార్య అంబర్‌ను చంపేందుకు ప్రయత్నించాడని, దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను చంపాలని చూశాడని, దీంతో భయభ్రాంతులకు గురైన అంబర్‌ తన మొబైల్‌ మెసెజ్‌ పంపిందని ఆమె స్నేహితుడు న్యూయార్క్ పోస్టు పత్రికకు తెలిపాడు.

'నేను వెంటనే ఆమె అపార్ట్‌మెంటుకు వెళ్లాను. అక్కడ ఆమె ముఖంపై కమిలిన గాయం ఉంది. పెదవి చీరుకుపోయింది. ఒక కన్నుకు గాయంతో వాపు వచ్చింది. తలపై కొన్ని వెంట్రుకలు ఊడిపోయి ఉన్నాయి. ఆమె దీన స్థితి చూసి నేను షాక్‌ తిన్నాను. తనను దిండుతో చంపాలని డెప్‌ చూశాడని, తనను విషమిచ్చి చంపేందుకు అతను వెనుకాడబోడని అంబర్‌ చెప్పింది' అని ఆయన వివరించాడు.

డెప్‌ ఎప్పుడూ గొడవపడుతూ తనను తీవ్రంగా కొట్టేవాడని, ఆమె పట్ల డెప్‌ దురుసుగా ప్రవర్తించడం తాను కూడా చాలాసార్లు చూశానని పత్రికకు తెలిపారు. ఇప్పటికే అంబర్‌ భర్త డెప్‌పై గృహహింస కేసు పెట్టింది. అతని నుంచి విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ఈ ఇద్దరు దంపతులు వేర్వేరుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'పైరెట్స్ ఆఫ్‌ ది కరేబియన్‌' వంటి చిత్రాలతో జానీ డెప్‌ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.

English summary
Johnny Depp's financial troubles are caused by a lavish $2m-a-month lifestyle, say the business managers he is suing for mismanaging his earnings.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu