భయపెడుతున్న ‘జురాసిక్ వరల్డ్’ ఫైనల్ ట్రైలర్ (వీడియో)
లాస్ ఏంజిల్స్: ఒళ్లు గగుర్బొడిచే సాహసాలు, డైనో సార్స్ గురించి సాగే మూవీ ‘జురాసిక్ పార్క్'. తొలిసారి స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'జురాసిక్ పార్క్...' వెండితెర ప్రపంచంలో ఓ సంచలనం. ఇప్పటికే ఈ సీరీస్ లో 3 సినిమాలు వచ్చి భారీ విజయం సాధించాయి. తాజాగా 4వ సానిమా ‘జురాసిక్ వరల్డ్' పేరుతో విడుదలువతోంది.

ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఫైనల్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ మరింత భయపెట్టే విధంగా, ఉత్కంఠ రేపుతూ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది. ఆ ట్రైలర్ మీద మీరూ ఓ లుక్కేయండి.
గతంలో ఈ సిరీస్ సినిమాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. . ఈ చిత్రానికి కోలిన్ ట్రేవోరోవ్ దర్శకత్వం వహించనున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, ఫ్రాంక్ మార్షల్, పాట్రిక్ క్రోవ్లీ, థామస్ తుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
క్రిష్ ప్రాట్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. జురాసిక్ వరల్డ్ పార్క్‌యజమాని సైమన్ మస్రానీ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు ఇర్ఫాన్.


Click it and Unblock the Notifications











