»   » 13 కే అవి వారి చేతికి ఇస్తే ఇంక వారు భూమి మీద ఆగుతారా..!

13 కే అవి వారి చేతికి ఇస్తే ఇంక వారు భూమి మీద ఆగుతారా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సెక్సీ భామ కిమ్ కర్దాషియాన్ పిల్లలకోసం ఇటవల కాలంలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న కార్యక్రమం ఏంటని అనుకుంటున్నారా పదమూడు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ప్రీపెయిడ్ క్రెడిడ్ కార్డులు ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో భాగంగా కిమ్ కర్ధాషియాన్ క్రెడిడ్ కార్డులు ప్రమోట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు మన కిమ్ కర్దాషియాన్.

ఈకార్యక్రమంలో కిమ్ కర్ధాషియాన్ మాట్లాడుతూ ఈ ప్రిపెయిడ్ మాస్టర్ కార్డ్స్ వల్ల తల్లిదండ్రులుకు చాలా ఉపయోగంగా ఉంటుందని అన్నారు. దీని వలన మీరు మీపిల్లలకు తగినంత డబ్బు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దీనిని వారు మంచి పనులకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తమపిల్లలకు మొబైల్ పోన్స్ నుండే డబ్బుని ఈక్రెడిడ్ కార్డుకు పంపించే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.

దీనిని బట్టి కార్డులో ఎంత మొత్తం ఐతే ఉంటుందో అంతవరకు మాత్రమే వారు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. ఈవిషయం వారి తల్లిదండ్రులకు కూడా ఇట్టే తెలిసిపోయే సౌకర్యాన్ని కూడా ఇందులో పోందుపరచడం జరిగింది. ఈక్రెడిడ్ కార్డుల ప్రమోషన్ కివచ్చినటువంటి పేరంట్స్ కూడా దీనిపై వారి భావాలను ఇలా పంచుకున్నారు. ఈఐడియా చాలా బాగుందని ప్రశంశించారు. మన దేశంలో డ్రగ్స్ భూతం బాగా ఉండడంతో మా అబ్బాయికి తక్కువ డబ్బునిఇవ్వడమే కాకుండా వాడు దానిని ఎలా ఖర్చు పెడుతున్నాడో గమనించడానికి అవకాశం ఉందని అన్నారు. దేనికంటే నెలనెల క్రెడిడ్ కార్డు బిల్లు ఇంటికి వస్తుంది కాబట్టి..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu