»   » అక్రమసంబంధం: భర్తను క్షమించనంటున్న హీరోయిన్!

అక్రమసంబంధం: భర్తను క్షమించనంటున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: బ్రిటన్ మోడల్, టీవీ స్టార్ క్యాటీ ప్రైస్ తన మాజీ భర్త కేరన్ హేలర్‌ను ఎప్పటికీ క్షమించను అంటోంది. హేలర్ తనను మోసం చేసాడని, తన స్నేమితురాలితోనే అక్రమ సంబంధం కొనసాగించాడని అంటోంది. నా స్నేహితురాలు జేన్ పౌట్నీతో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని....నన్ను మోసం చేసిన అతన్ని ఎప్పటికీ క్షమించను అని తేల్చి చెప్పింది.

రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చే క్రిస్ మస్‌కు అతన్ని కలవబోతున్నాను. ఈ సందర్భంగా అతనికి ఓ బహుమతి కూడా ఇవ్వబోతున్నాను. ఆ బహుమతి అతను చేసిన మోసాన్ని గుర్తు చేసేలా ఉంటుంది అన్నారు. అయితే ఆ బహుమతి ఏమిటి? అనే విషయం మాత్రం క్యాటీ ప్రైస్ వెల్లడించలేదు.

జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు...
క్యాటీ ప్రైస్ జీవితంలో చిన్న తనం నుండే ఎన్నో చేతు జ్ఞాపకాలు ఉన్నాయి. ఏడేళ్ల వయసులోనే లైంగిక వేదింపులకు గురైంది. యుక్తవయసుకు వచ్చాక అత్యాచారానికి గురైంది. గతంలో ఓ రేడియో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ...నాకు ఏడేళ్ల వయసు ఉన్నపుడు అమ్మతో కలిసి పార్కుకు వెళ్లాను. అమ్మ నాకు ఐస్ క్రీం తీసుకురావడానికి వెళ్లింది. ఆ సమయంలో ఓ పెద్దమనిషి వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు. ఆ సంఘటన నేను నా జీవితంలో ఇప్పటికీ మరిచిపోలేదు' అని క్యాటీ ప్రైస్ చెప్పుకొచ్చారు.

మోడలింగ్ చేసే రోజుల్లోనూ క్యాటీ ప్రైస్ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. యుక్త వయసులో ఉన్నపుడు కొందరు మగాళ్లు తనను చుట్టు ముట్టి రేప్ చేసినట్లు ఆమె వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలోకి ఎందుకొచ్చానా? అని భాధ పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

విసిగిపోయింది

విసిగిపోయింది

పెళ్లి చేసుకోవడం, విడిపోవడం లాంటి వాటితో విసిగిపోయానని, అందుకే ఇకపై పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఓ సెలబ్రిటీ కూడా రేప్ చేసాడంట

ఓ సెలబ్రిటీ కూడా రేప్ చేసాడంట

గతంలో ఓ సారి ఆమె ఓ షాకింగ్ విషయం బయట పెట్టింది. ఓ ప్రముఖ సెలబ్రిటీ తనను రేప్ చేసాడని చెప్పుకొచ్చారు. అయితే అతను ఎవరు? అనే విషయం మాత్రం క్యాటీ ప్రైస్ బయట పెట్టలేదు.

పిల్లలే జీవితం

పిల్లలే జీవితం

37 సంవత్సరాల ఈ అమ్మడు తన ఐదుగురు పిల్లలే జీవితంగా జీవిస్తోంది.

English summary
Katie Price has admitted she still hasn't forgiven husband Kieran Hayler for cheating on her and probably never will. The 37-year-old former glamour model was left devastated when in May last year she discovered her husband had been having an affair with her long time friend and maid of honour Jane Pountney.
Please Wait while comments are loading...