»   » సెక్సీ కత్రినాకైఫ్ ... 'కుంగ్‌ ఫూ యోగా' (ఫొటో ఫీచర్)

సెక్సీ కత్రినాకైఫ్ ... 'కుంగ్‌ ఫూ యోగా' (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ కు అద్బుతమైన ఆఫర్ వచ్చింది. ఆమె జాకీఛాన్ చిత్రం 'కుంగ్‌ ఫూ యోగా' లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఆ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'ఏక్‌ థా టైగర్‌' కోసం నేర్చుకున్న ఫైట్లు ఇప్పుడు జాకీచాన్‌తో నటించే అవకాశాన్ని సంపాదించిపెట్టడం ఆమెను ఆనందంలో ముంచేస్తోంది. అవును ఈ భామ త్వరలో ప్రముఖ నటుడు జాకీచాన్‌తో జోడీ కట్టబోతోంది. జాకీచాన్‌ ప్రధాన పాత్రలో 'కుంగ్‌ ఫూ యోగా' తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కత్రినాను సంప్రదించిందట చిత్ర యూనిట్.

ఇందులో హీరోయిన్ చైనా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తుంటుంది. యుద్ధ విద్యలు తెలిసిన మహిళ. ఇలాంటి పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేద్దామా అనుకున్న సమయంలో కత్రినా పేరు ప్రస్తావనకు వచ్చింది.

చిత్రం గురించి మరిన్ని వేశేషాలు...స్లైడ్ షోలో...

ఇంకా ధ్రువీకరించలేదు

ఇంకా ధ్రువీకరించలేదు

'ఏక్‌ థా టైగర్‌'లో ఆమె పోరాటాలు చేసిన విషయం తెలిసి కత్రినాను సంప్రదించారు. దీనికి ఆమె కూడా సుముఖుత వ్యక్తం చేసిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఆ కాలంలో జరుగుతుంది

ఆ కాలంలో జరుగుతుంది

క్రీ.పూ.542-492 కాలానికి చెందిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నిథి వేటతో...

నిథి వేటతో...

ఆయన పాలించిన మగధ సామ్రాజ్యానికి చెందిన నిధిని వెతుకుతూ వెళ్లే జంటగా జాకీచాన్‌, కత్రినా కనిపిస్తారట.

జాకీ ఛాన్ పాత్ర ఇది

జాకీ ఛాన్ పాత్ర ఇది

చైనా పురాతత్వ శాస్త్రవేత్తగా జాకీచాన్‌ కనిపించనున్నారు.

దర్శకుడు ఎవరంటే...

దర్శకుడు ఎవరంటే...

ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్‌ దర్శకత్వం వహిస్తాడు.

జాకీ ఛాన్ మాట్లాడుతూ...

జాకీ ఛాన్ మాట్లాడుతూ...

''నటుడికి జీవితం ఎక్కువే ఉంటుంది. కానీ యాక్షన్‌ స్టార్ల జీవితం మాత్రం పరిమితం. ఇక తెరపై పోరాటాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకొన్నాను. కొందరు 'మీరు ఇంకా చలాకీగానే కనిపిస్తున్నారు కదా' అని అంటున్నారు. నిజమే కావచ్చు.. కానీ ఏదోక రోజు విరమణ ప్రకటించాలి కదా. '' అన్నారు.

ఇక్కడా మంచి మార్కెట్

ఇక్కడా మంచి మార్కెట్

వెండి తెరపై కరాటే విన్యాసాలు అనగానే జాకీచాన్‌ గుర్తుకొస్తారు. చైనా యుద్ధ కళలతో జాకీ చేసే పోరాటాలంటే యాక్షన్‌ సినిమా ప్రియులకు చెప్పలేనంత ఇష్టం. జాకీ ఛాన్ కు ఇండియాలోనూ ఓ రేంజి అబిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో మంచి మార్కెట్ ఏర్పడుతోంది.

ఇక్కడా చేస్తా

ఇక్కడా చేస్తా

బాలీవుడ్‌ సినిమాలో నటించాలని ఉందన్న తన మనసులోని కోరికను జాకీచాన్‌ బయటపెట్టారు. ''నాకు హాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ తేడాల్లేవు. స్క్రిప్టు నచ్చడం ముఖ్యం'' అన్నారు జాకీ.

అమీర్ సినిమా నచ్చింది

అమీర్ సినిమా నచ్చింది

ఆమీర్‌ నటించిన '3 ఇడియట్స్‌' చైనాలో విడుదలై అక్కడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాతోనే 'పీకే' ఆమీర్‌ అభిమానిగా మారిపోయానంటున్నాడు జాకీచాన్‌.

అద్బుతమైన నటుడు

అద్బుతమైన నటుడు

'నేను బాలీవుడ్‌ చిత్రాలు చూసేది చాలా తక్కువ. 2009లో హాంకాంగ్‌లో '3 ఇడియట్స్‌' చూశా. అందులో ఆమీర్‌ నటన చూడగానే వెంటనే ఆయన అభిమానిగా మారిపోయా. ఆమీర్‌ అద్భుతమైన నటుడు'' అన్నారు జాకీచాన్‌.

English summary
Katrina Kaif has a number of upcoming Bollywood films including Jagga Jasoos and Phantom, but the actress is likely to make a mark in the Chinese film industry as well. As reported, Katrina will be seen along with none other than Jackie Chan in the upcoming Indo-Chinese project Kung Fu Yoga. But, the actress's spokesperson says otherwise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu