»   »  ఆలోచనాత్మకంగా.....లేడీ గాగా రేప్ సాంగ్ (వీడియో)

ఆలోచనాత్మకంగా.....లేడీ గాగా రేప్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా 'టిల్ ఇట్స్ హాప్పెన్స్' పేరుతో గతేడాది వీడియో ఆల్బం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనలను ఫోకస్ చేస్తూ ఈ వీడియో తెరకెక్కించారు. ఈ వీడియో ఆల్బంకు ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కోట్లాది మంది ఈ వీడియో వీక్షించారు.

అదే సాంగును ఇటీవల జరిగిన 88వ అకాడెమీ(ఆస్కార్) అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పాట పాడుతూ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు లేడీ గాగా. లేడీ గాగా కూడా ఒకప్పుడు లైంగిక దాడికి గురైన వ్యక్తే కావడంతో......ఆ బాధ ఎలా ఉంటుందో ఆమె మరోసారి తన పాట రూపంలో బయట పెట్టారు.

Lady Gaga's new video glamorises rape

నాపై రేప్ జరిగాక పూర్తిగా మారిపోయానంటున్న స్టార్ సింగర్
కేవలం పాట పాడటం మాత్రమే కాదు... తనలాగే 50మంది లైంగికదాడికి గురైన బాధితులను ఆస్కార్ వేదికపైకి తీసుకువచ్చి వారితో కలిసి ఆ పాటను ఆలపించింది. మీ వరకు వస్తే కానీ.. మీకు జరిగితే కానీ తెలియదు మా బాధేంటో..! మేం చేసిన నేరమేమిటి? మాకెందుకీ శిక్ష? అంటూ సాగిన ఆ పాటలో తనను తాను ఆవిష్కరించుకుంది లేడీ గాగా. ప్రతి ఒక్కరూ ఈ సమస్య గురించి ఆలోచించే విధంగా చేసింది.

మహిళలు సెక్సువల్ వయొలెన్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే అవగాహన తేవడంలో ఈ వీడియో తోప్పడుతుందని అంటున్నారు. అమెరికన్ కాలేజీల్లో ప్రతి ఐదు మంది అమ్మాయిల్లో ఒకరు సెక్సువల్ హరాస్మెంటుకు గురవుతున్నారు.

ఈ సమస్యను బేస్ చేసుకుని 'టిల్ ఇట్స్ హాప్పెన్స్' పేరుతో వీడియో ఆల్బం విడుదల చేసారు. కాలేజీ అమ్మాయిలు, తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ఇలాంటి పోకడల పట్ల అప్రమత్తం ఉండాలనే ఒక సందేశంతో ఈ వీడియో తెరకెక్కించారు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రతి దేశంలో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారనేది వాస్తవం.

English summary
Lady Gaga performs “Til It Happens To You” at the 88th Academy Awards ceremony (February 28, 2016)
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu