twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్లిన్ మాన్రో మర్డర్ మిస్టరీకి 58 ఏళ్లు.. యూఎస్ అధ్యక్షుడితో అక్రమ సంబంధమే..

    |

    ప్రపంచ సినీ ప్రేక్షకులను అందం, అభినయంతో ఆకట్టుకొన్న సుందరి మార్లిన్ మాన్రో అనుమానాస్పద మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. మాన్రో మరణించి ఇప్పటికీ 58 సంవత్సరాలు దాటినా ఇంకా ఆమె మరణంపై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిన మాన్రో గురించి కొన్ని విషయాలు మీకోసం..

     పేదరికంలో పుట్టి.. అనాథ శరణాలయంలో పెరిగి

    పేదరికంలో పుట్టి.. అనాథ శరణాలయంలో పెరిగి

    మార్లిన్ మాన్రో అసలు పేరు నోర్మా జీన్ మార్టెన్‌సన్. 1926 జూన్ 1వ తేదీన లాస్ ఎంజెలెస్‌లో జన్మించారు. చిన్నతనంలో పేదరికంతో పెరిగారు. అనాథ శరణాయంలో పెరిగిన ఆమె ఎన్నో కష్టాలను అనుభవించారు. మార్లిన్ మాన్రో 1946లో ట్వెంటీయత్ ఫాక్స్ సెంచరీ నిర్మాణ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. అప్పుడే ఆమె పేరును మార్లిన్ మాన్రోగా మారారు.

     నగ్నంగా ఫోటోషూట్‌తో సంచలనం

    నగ్నంగా ఫోటోషూట్‌తో సంచలనం

    మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనతికాలంలో సూపర్‌స్టార్‌గా మారారు. హాలీవుడ్ క్యాలెండర్ కోసం 1949లో నగ్నంగా ఫోటోషూట్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పటికీ ఆమె ఫోటోషూట్స్‌‌కు క్రేజీగా రెస్పాన్స్ ఉంటుంది. 1950 నుంచి 60 వరకు ఆమె సెక్స్ సింబల్‌గా నీరాజనాలు అందుకొన్నారు. దశాబ్ద కాలంలో ఆమె నటించిన చిత్రాలు 200 మిలియన్ల డాలర్లు (ప్రస్తుత అంచనా 2 బిలియన్ డాలర్లు) సంపాదించాయి.

    గందరగోళంగా వైవాహిక జీవితం

    గందరగోళంగా వైవాహిక జీవితం

    నటిగా అద్భుతమైన గ్రాఫ్‌ను సొంతం చేసుకొన్న మాన్రో వైవాహిక జీవితం గందరగోళంగానే ముగిసింది. మాన్రో తన 16వ ఏటనే ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ వర్కర్‌ను పెళ్లి చేసుకొన్నారు. కానీ వారి దాంపత్య జీవితం ఎక్కువనాళ్లు సాగలేదు. 1956లో ఆర్థర్ మిల్లర్ అనే రచయితను పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత 1959లో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చారు. దాంపత్య జీవితం విఫలం కావడంతో డిప్రెషన్‌లొకి వెళ్లారు. ఆ తర్వాత రాల్ఫ్ గ్రీన్‌సన్ అనే సైక్రియాటిస్ట్ వద్ద చికిత్స పొందారు.

    అనుమానాస్పద పరిస్థితుల్లో నగ్నంగా మరణం

    అనుమానాస్పద పరిస్థితుల్లో నగ్నంగా మరణం

    కెరీర్ పీక్‌లో ఉండగానే ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో 1962 ఆగస్టు 5వ తేదీన మరణించారు. ఆమె మరణంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్లిన్ మాన్నో తన నివాసంలో బెడ్‌పై నగ్నంగా విగతజీవిగా పడి ఉన్నారు. ఓ చేతిలో టెలిఫోన్, మరో చేతిలో డిప్రెషన్‌కు వేసుకొనే మందు బిల్లల ఖాళీ సీసాతో బెడ్‌పై కనిపించారు. ఓవర్ డోస్‌తో ఉండే నిద్ర మాత్రలు ఎక్కువగా మింగి మాన్రో ఆత్మహత్య చేసుకొన్నారని లాస్ ఎంజెలెస్ పోలీసులు నిర్ధారించారు.

    అమెరికా అధ్యక్షుడితో సంబంధమే కారణమని

    అమెరికా అధ్యక్షుడితో సంబంధమే కారణమని

    మాన్రో మరణానికి ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీతో అక్రమ సంబంధం పెట్టుకొన్నారనే వార్తలు హాలీవుడ్‌ మీడియాలో వచ్చాయి. ఆమె మరణానికి కారణం కెనడీతో రిలేషన్‌షిప్ కారణమనే ఆరోపణలు వచ్చాయి. కెనడీతో అక్రమ సంబంధం కారణంగానే ఆమె హత్యకు గురయ్యారు అనే ఆరోపణలు వినిపించాయి. అయితే మాన్రో మరణం ఇప్పటికీ మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోయింది.

    English summary
    Hollywood top star Marilyn Monroe murder mistery even now remain as question. She died on August 5, in the year 1962. Reports suggest that, Monroe alleged relationship with John F Kennedy cause for her death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X