»   » 51 కత్తి గాట్లు, కాలిన జుట్టు, ఎముకల మీద చర్మం పరచినట్టున్న దేహం..!!

51 కత్తి గాట్లు, కాలిన జుట్టు, ఎముకల మీద చర్మం పరచినట్టున్న దేహం..!!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ అనుమానాశ్పద రీతిలో గత ఏడాది జూన్ 25వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల వెలువడిన డెత్ రిపోర్ట్ లో ఆయన మృతికి ప్రొపొఫోల్ అనే ఉత్ప్రేరకమే కారణం అన్న సంగతి వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన వ్యక్తిగత వైధ్యుడు డా. ముర్రేను బాధ్యున్ని చేస్తూ కోర్ట ఆయన్ని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా నిన్న(బుధవారం, 10వ తేదీన) మైఖేల్ కు సంబంధించిన తాజా డెత్ రిపోర్ట్ ను విడుదల చేసారు. ఇందులో మైఖేల్ కు ఎంత మోతాదులో ప్రొపొఫోల్ అందించారు, చనిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అనే విషయాలను విషదపరిచారు. ఈ రిపోర్టు ప్రకారం మైఖేల్ జూన్ 25వ తేదీన రాత్రి 1 am కు తన వ్యక్తిగత వైధ్యుడు ముర్రేను తను అద్దెకు తీసుకున్న ఇంటికి రమ్మన్మాడు. లండన్ లో జరగాల్సిన షోకు ప్రాక్టీసు చేసి బాగా అలసిపోయిన మైఖేల్ తనకు నిద్రపట్టలేదని డాక్టర్ కు తెలిపాడు. దీంతో ముర్రే అతనికి ప్రొపొఫోల్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ను ఇచ్చాడు ముర్రే. ఆ తర్వాత మరో మూడుగంటల్లోపు మైఖేల్ చనిపోయాడని ప్రకటించాడు డాక్టర్ ముర్రే. అంటే అంతకు మూడు గంటల ముందు అందించిన డ్రగ్సే మైఖేల్ ప్రాణాలను హరించాయి అని ఈ రిపార్టులో తెలిపారు.

ఇంకా మైఖేల్ మరణానంతరం అతన్ని పరీక్షించిన డాక్టర్లు ఆయన మైఖేల్ అని నిర్ధారించడానికి చాలా కష్టపడాల్సివచ్చిందట. దీనికి కారణం మైఖేల్ నిజరూపం ఎవ్వరికీ తెలియకపోవడమే. ఆ సమయంలో ఆయన తలమీద కాలిపోయిన వెంట్రుకలు విగ్ కు కలపబడి వున్నాయి. ఇంతకు ముందు 1984లో పెప్సీ సంస్థ ప్రకటన షూటింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మైఖేల్ జుట్టు మొత్తం కాలిపోయిన సంగతి తెలిసిందే. అతని శరీరం మొత్తం తెలుపు, నలుపు మచ్చలు వున్నాయి. నల్లగా వున్న మైఖేల్ తెల్లగా కనిపించడానికి ఎన్నో చికిత్సలు చేయించుకోవడం వల్ల ఆయనకు ఈ చర్మవ్యాధులు అంటుకున్నాయని మైఖేల్ వ్యక్తిగత చర్మవైధ్యుడు తెలిపాడు. అలాగే మైఖేల్ కు కను బొమ్మలు అస్సలు లేవని అక్కత టాటూ లాంటిది వేయించుకొని, ఆ లోటు కనిపించకుండా జాగ్రత్తపడ్డారని కూడా ఈ నివేదికలో తేటతెల్లం అయింది. తన పెదాల మీద కూడా టాటూ వేయించుకున్నాడు మైఖేల్.

వీటికి తోడు చికిత్స అందించే సమయంలో మైఖేల్ రిబ్స్ లో చాలా ఎముకలు విరిగిపోయాయని, ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా దెబ్బతినిందని తెలిపారు. ఇంకో విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. 69 ఇంచుల పొడవున్న మైఖేల్ మరణించినప్పుడు కేవలం 136 పౌండ్లు(సుమారు 61 కేజీలు) బరువు మాత్రమే వున్నాడట. ఎముకల మీద చర్మం పరచినట్టున్న ఆయన దేహాన్ని చూసి డాక్టర్లే ఆష్చర్యపోయారంట. మొత్తంగా ఆయన ఒంటి మీద 51 కత్తిగాట్లు ఉన్నాయంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu