»   »  పాండా మీట్స్ పప్పా :'కుంగ్‌ఫూ పాండా-3' కొత్త ట్రైలర్‌ (వీడియో)

పాండా మీట్స్ పప్పా :'కుంగ్‌ఫూ పాండా-3' కొత్త ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

‌లాస్ ఏంజిల్స్ : బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు చేసి రికార్డులు సృష్టించిన 'కుంగ్‌ఫూ పాండా'కు మూడో సీక్వెల్‌ సిద్ధమైంది. ఇప్పటి వరకు విడుదలైన రెండు భాగాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి భారీ కలెక్షన్లు చేశాయి. తన కుంగ్‌ఫూ స్టంట్స్‌తో అందరినీ నవ్వించిన 'పో'(పాండా) మళ్లీ వచ్చేసాడు. ఈ చిత్రానికి సంభందించిన కొత్త ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సారి పాండా..స్టూడెంట్ నుంచి టీచర్ గా మారాడు. ఈ కొత్త సినిమాలో చిన్నప్పుడే తప్పిపోయిన తండ్రి తిరిగి వచ్చి పర్వతాల మధ్య ఉన్న పాండా ప్యారడైజ్ కు రమ్మని ఆహ్వానిస్తాడు. అయితే అదే సమయంలో కాయ్ అనే సూపర్ నాచురల్ విలన్ ...దేశాన్ని నాశనం చేయటం మొదలెడతాడు. అప్పుడు అటు కుటుంబానికి విలువ ఇస్తూనే మిగతా పాండా లను అన్నిటిని పోగు చేసి తాను టీచర్ గా మారి, ఆ సూపర్ నాచురల్ పవర్ మీదకు యుద్దానికి సిద్దం చేస్తాడు.

New Kung Fu Panda 3 trailer!:Po reunites with his poppa

ఈ రోజున ప్రపంచంలో కుంగ్ ఫూ పాండా గురంచి తెలియని చిన్నారులు అరుదనే చెప్పాలి. చిత్రమైన ఫన్నీ ఆకారంతో మురిపించే ఈ పాండా అందరి మన్ననలూ పొందింది.


ఈ చిత్రం వచ్చే జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జాక్‌ బ్లాక్‌, ఏంజెలీనా జోలీ, డస్టిన్‌ హాఫ్‌మెన్‌, జాకీచాన్‌ వంటి ప్రముఖ హాలీవుడ్‌ నటులు డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

విడుదల చేసిన కుంగ్‌ఫూ పాండా-3 ట్రైలర్‌కి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ ట్రైలర్‌ను దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. 20సెంచరీ ఫాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, డ్రీమ్‌ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2016 జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

New Kung Fu Panda 3 trailer!:Po reunites with his poppa

2004లో స్టీఫెన్‌ చో ‘కుంగ్‌ఫూ హసల్‌' అనే చిత్రమే ఈ కుంగ్‌ఫూ పాండా చిత్రాల సీరిస్ కు స్పూర్తినిచ్చిందంటారు. అయితే ఈ చిత్రంలోనూ ప్రతిష్టాత్మక చైనా కుంగ్‌ఫూనే చూపాలన్నది గట్టిగా నమ్మారు. దానికోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ రేమాండ్‌ జిబాక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ టాంగ్‌ హెంగ్‌లు చాలా కాలం చైనా పెయింటింగ్స్‌, ఆర్క్‌టెక్చర్‌, కుంగ్‌ఫూ చిత్రాలు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిం చారు. ఆ పరిశీలనతో తెలుసుకున్న అనేకాంశాల ఆధారంగానే ఈ యానిమేషన్‌ చిత్రాన్ని పకడ్బందీగా రూపొందించారు.

English summary
DreamWorks Animation has just debuted the first Kung Fu Panda 3 trailer, which you can check out. In the animated feature film sequel, Po, continuing on his now legendary adventures of awesomeness, must face two hugely epic, but very different threats: one supernatural and the other a little closer to home. Latest installment in animated franchise hits theaters on Jan. 29
Please Wait while comments are loading...