»   »  ఆ స్టార్ హీరో మరణానికి కారణం అతని తప్పిదమే!

ఆ స్టార్ హీరో మరణానికి కారణం అతని తప్పిదమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ స్టార్ పాల్ వాకర్ 2013లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతడు ప్రాయణిస్తున్న స్పోర్ట్స్ కార్ మోడల్ పోర్షే కెరీరా జిటి కారు ఈ ప్రమాదంలో పూర్తిగా కలిపోవడంతో పాటు పాల్ వాకర్, అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న రోజర్ రోడ్స్ అక్కడిక్కడే మృతి చెందారు.

అయితే కారులో సమస్య వల్లే తన తండ్రి మరణించాడని అతడి కుమార్త మీడో వాకర్ కోర్టు కెక్కడంతో.... పోర్షె ఉత్తర అమెరికా విభాగం కోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇచ్చింది. పాల్ వాకర్ తప్పిదం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని, కారులో ఎలాంటి లోపం లేదని 7 పేజీల్లో వివరణ ఇచ్చింది.

Paul Walker's death was his 'own fault', says Porsche

పోర్షే కెరీరా జిటి లిమిటెడ్ ఎడిషన్ కారు కొనే ముందు కారు గురించి అతడు అన్ని విషయాలు తెలుసుకున్నాడని, ఈ కారు వల్ల ఎలాంటి సందర్భాల్లో రిస్క్‌కు గురవుతామనే విషయాలు కూడా అతని తెలుసు. అన్ని తెలిసి అతడు కొన్ని తప్పులు చేసాడు. దాని వల్లే ప్రమాదం జరిగింది అని పోర్షే కంపెనీ వివరణ ఇచ్చింది.

పాల్ వాకర్ ప్రమాదకర స్థాయిలో అత్యంత వేగంగా కారు నడిపాడు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలి పోయింది. వాహనం మొత్తం నుజ్జునుజ్జయింది. వరుస చిత్రాలతో హాలీవుడ్లో బిజీగా ఉన్న పాల్ వాకర్ మృతి అభిమానులను కలిచివేసింది.

English summary
The German sports car manufacturer Porsche has claimed that the death of Fast & Furious star Paul Walker in a high-speed crash in November 2013 was the actor’s “own comparative fault”.
Please Wait while comments are loading...