»   » ఇరాక్ యుద్ధభూమిలో ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా..!!

ఇరాక్ యుద్ధభూమిలో ఆమె పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందా..!!

Subscribe to Filmibeat Telugu

ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ప్రకటించే వరకూ ఆ సినిమా గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ నామినేషన్లు ప్రకటించాకా అందరూ అత్యధిక నామినేషన్లు వస్తాయని భావించిన అవతార్ సినిమాకు ధీటుగా తానేమాత్రం తీసిపోనని ఏకంగా తొమ్మిది నామినేషన్లు పొందింది విమర్శకుల ప్రశంసలను పొందిన క్యాథరీన్ బిగిలోవ్ దర్శకత్వం వహించిన 'ది హర్ట్ లాకర్' సినిమా. ఆస్కార్ గేట్ పాస్ గా పేర్కొనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డును సొంతం చేసుకుని అవతార్ సినిమాకు షాక్ ఇచ్చిన క్యాథరీన్ సినిమా హర్ట్ లాకర్స్ గురించిన విశేషాలు మీకోసం....

ఇరాక్ యుద్ధనేపథ్యంలో సాగే ఈ చిత్రం సుశిక్షితులైన మిలటరీ అధికారుల వీరోచిత సాహసాలు, భారీ విస్పోటనం కలిగించే బాంబులను నిర్వీర్యం చేసేందుకు వారు పడే శ్రమ సినిమాలో ప్రధానంగా కలిపిస్తాయి.

ఈ సినిమా కథ కోసం పనిచేసిన మార్క్ బోయెల్ ఉత్తమ స్క్రీని ప్లే విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఈ కథను సిద్ధం చెయ్యడానికి ఆయన ఇరాక్ లోని సైనికుల వద్ద రెండు వారాల పాటు వుండి వీరి జీవన విధానాన్ని పరిశీలించి మరీ సిద్ధం చెయ్యడం విశేషం.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్యాథరీన్ బిగిలోవ్ ఆస్కార్ ఉత్తమ దర్శకుడు/దర్శకురాలి విభాగంలో నామినేట్ అయిన నాలుగవ మహిళ. ఇంతకు ముందు నామినేట్ అయిన వారెవ్వరూ అవార్డును సాధించలేకపోయారు. కానీ ఈమె తప్పకుండా అవార్డును సాధింస్తుందనే అంచనాలు వున్నాయి, వీటికి డైరెక్టర్ గిల్డ్ అవార్డు మరింత సాయం చేసింది.

బాక్సాఫీసు వద్ద కేవలం 17 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా సుమారు 2 బిలియన్ డాలర్లు వసూలు చేసిన అవతార్ తో పోటీ పడుతోంది. బాక్సాఫీసు వద్ద ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిన ఏ చిత్రంమూ ఇంతవరకూ ఆస్కార్ నామినేషన్ సాధించలేదు. కానీ ఈ సినిమా ఏకంగా తొమ్మిది నామినేషన్లు దక్కించుకోవడం గమనార్హం.

ఇన్ని విశేషాలున్న ఈ సినిమా తప్పక ఆస్కార్ అవార్డుల్లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలుకాలని మనం కూడా ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu