Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఐపీఎల్ ఫైనల్ ముందు రాజస్థాన్, గుజరాత్ ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే
- Finance
మళ్లీ వంటగ్యాస్ ధరల పెంపు: కత్తినూరుతున్న ఆయిల్ కంపెనీలు: 1 నుంచి
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Automobiles
హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Priyanka Chopra 100 రోజుల తర్వాత ఇంటికి చేరిన కూతురు.. గుండెలకు హత్తుకొని తొలి ఫోటో షేర్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటి, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మాతృత్వపు అనుభూతిని పొందుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నది. చాలా రోజుల తర్వాత తన కూతురు ప్రత్యక్షంగా కలుసుకొని ఎమోషనల్ అయింది. ప్రియాంక చోప్రా తన కూతురు గుండెలకు హత్తుకొన్న ఫోటోను షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలను తన అభిమానులకు, సన్నిహితులకు, స్నేహితులకు అందజేసింది. అయితే గత జనవరిలో పుట్టిన తన కూతురుకు ప్రియాంక ఎందుకు దూరం ఉందనే విషయంలోకి వెళితే..

సర్రోగసి ద్వారా సంతానం
హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా సంతానం కోసం నిర్ణయం తీసుకొన్నారు. దాంతో నిక్ జోనస్, ప్రియాంక దంపతులు సర్రోగసి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో వారిద్దరూ పక్కాగా ప్లాన్ చేసుకొని 2022 ఏడాది జనవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బిడ్డ నెలలు నిండాకుండా పుట్టడంతో వారి ఆనందానికి కాస్త బ్రేక్ పడింది.

నెలలు నిండకుండా పుట్టడంతో
దాంతో వైద్యులు సూచనతో ప్రియాంక చోప్రా తన కూతురును నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) గదిలో దాదాపు 100 రోజులపాటు ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే 100 రోజుల కంటే ఎక్కువగానే పాపను ఐసీయూలో పెట్టి సంరక్షించారు. ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా తన కూతురుకు మల్టీ మేరీ చోప్రా అని నామకరణం చేశారు. మదర్స్ డే సందర్భంగా తన కూతురు ఫోటోను షేర్ చేశారు.

మా ఇంటికి చేరిందంటూ
మదర్స్ డేను పురస్కరించుకొని ప్రియాంక చోప్రా శుభాకాంక్షలు అందజేశారు. గత కొద్ది నెలలుగా టెన్షన్‌తో కూడిన క్షణాలను అనుభవించాం. వాటిని మాటల్లో చెప్పలేం. మా మాదిరిగానే ఇలాంటి క్షణాలను ఎంతో మంది అనుభవించి ఉంటారు. 100 రోజుల తర్వాత ఎట్టకేలకు మా ఇంటికి చేరింది. గత కొద్దినెలలుగా అనేక సవాళ్లను అధిగమించి ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఆనంద క్షణాలను అనుభవిస్తున్నాం అని ప్రియాంక చోప్రా చెప్పారు.

వైద్యులకు ధన్యవాదాలు
మల్టీ
మేరి
చోప్రా
క్షేమంగా
ఇంటికి
రావడానికి
ఎంతో
కృషి
చేసిన
డాక్టర్లు,
నర్సులకు
థ్యాంక్స్.
లాస్
ఎంజెలెస్‌లోని
రాడీ
చిల్డ్రన్స్
లా
జోల్లా,
సెడార్
సినై
వైద్య
నిపుణులు
మేరి
ఆరోగ్యాన్ని
జాగ్రత్తగా
చూసుకొన్నారు.
మేరి
ఆరోగ్యాన్ని
జాగ్రత్త
చూసుకొని..
మా
ఇంటికి
వచ్చేలా
చేశారు.
ఇప్పుడు
తల్లిదండ్రులుగా
గొప్ప
క్షణాలను
ఆస్వాదిస్తున్నాం
అని
ప్రియాంక
చోప్రా
తన
పోస్టులో
తెలిపారు.

ప్రియాంక చోప్రా సినీ కెరీర్ ఇలా
ప్రియాంక సినీ కెరీర్ విషయానికి వస్తే.. రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ చిత్రంలో హాలీవుడ్ నటి సెలీన్ డియన్ కూడా నటిస్తున్నది. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రస్సెల్ టోవీ, ఓమిడ్ డాజిలీ, సెలియా ఇమ్రై నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అమెరికా, లండన్‌లో జరిగింది.