»   » ఇలాంటి సీన్లు చేయడానికి సిగ్గులేదా? ప్రియాంకపై భగ్గుమంటున్న భారతీయులు!

ఇలాంటి సీన్లు చేయడానికి సిగ్గులేదా? ప్రియాంకపై భగ్గుమంటున్న భారతీయులు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Priyanka Chopra Gets Comments From Tweeters On Quantico

  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సీరిస్ 'క్వాంటికో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఏపిసోడ్లో ప్రసారం అయిన సీన్లపై భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌‌లోని మాన్‌హట్టన్ ప్రాంతంలో భారతీయులు పేలుళ్లకు ప్రయత్నించారనే విధంగా ఇందులో చూపించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా భారతీయులను యూనైటెడ్ స్టేట్స్, ప్రపంచం దృష్టిలో చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పలువురు మండి పడుతున్నారు. ఈ షోతో పాటు ఇందులో నటించిన ప్రియాంక చోప్రా మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్లో కామెంట్స్ వర్షం కురుస్తోంది.

  ఆ సీన్లో ఏముంది?

  ఆ సీన్లో ఏముంది?

  ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ టీవీ సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న సీన్ గురించి ఆదిత్ కపాడియా అనే వ్యక్తి ట్విట్టర్లో వెల్లడించారు. ‘తాజా ఎపిసోడ్లో ప్రియాంక చోప్రా ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఓ టెర్రరిస్ట్ మెడలో రుద్రాక్షమాల కనిపిస్తుంది. దాని ఆధారంగా వారు ఇండియన్స్ అని నిర్దారణకు వస్తారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల ముసుగులో ఇండియన్సే పేలుళ్లకు ప్లాన్ చేశారు అనే విధంగా సీన్లో చూపించారు' అని వెల్లడించారు. టీవీ షో అయినప్పటికీ భారతీయులను ఇలా చిత్రీకరించే ప్రయత్నం చాలా దారుణమని, దీని వల్ల అమెరికన్లలో భారతీయులపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

  సిగ్గుగా ఉందంటూ ప్రియాంకపై విమర్శలు

  సిగ్గుగా ఉందంటూ ప్రియాంకపై విమర్శలు

  భారతీయులను తప్పుడుగా చిత్రీకరిస్తున్న క్వాంటికో లాంటి టీవీ సిరీస్‌లో నటిస్తున్న ప్రియాంకను చూస్తుంటే సిగ్గేస్తుంది.... అంటూ కొందరు ట్విట్టర్ ద్వారా మండి పడ్డారు.

  డొనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేసిన మరో వ్యక్తి

  డొనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేసిన మరో వ్యక్తి

  మరో వ్యక్తి తను చేసిన కామెంటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ... ఇండియాను డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

   వాదోపవాదాలు

  వాదోపవాదాలు

  ఈ వివాదాస్పద సీన్ మీద ట్విట్టర్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మనం కలిసికట్టుగా లేనపుడు ఇతరులను అని ఏం లాభం అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

   ఇలా చేయడం సరికాదు

  ఇలా చేయడం సరికాదు

  భారతీయులను దోషులుగా చిత్రీకరిస్తూ క్వాంటికో లాంటి టీవీ సీరిస్‌లో సీన్లు పెట్టడం, ఇలాంటి వాటిలో భారతీయురాలైన ప్రియాంక చోప్రా నిరభ్యంతరంగా నటించడం దారుణమని, ఇది సరైంది కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  రోహింగ్యాలతో ముడిపెట్టిన మరికొందరు

  రోహింగ్యాలతో ముడిపెట్టిన మరికొందరు

  ప్రియాంక చోప్రా ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యాల క్యాంపును సందర్శించి ఘటనను.... క్వాంటికోకు లింకు పెడుతూ విమర్శల వర్షం గుప్పించారు మరికొందరు. ప్రియాంక ఇపుడు డబ్బు దాహంతో ఉందని మండి పడ్డారు.

  ప్రియాంక మీద ఆగ్రహం

  ప్రియాంక మీద ఆగ్రహం

  ప్రియాంక చోప్రా హాలీవుడ్లో తన కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉందని, ఇందుకోసం ఇండియాను డిఫేమ్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు అని మరికొందరు మండి పడ్డారు.

  బూతులు వాడొద్దు

  బూతులు వాడొద్దు

  క్వాంటికో వ్యవహారంలో ప్రియాంక చోప్రా మీద విమర్శలు చేయండి. కానీ ఎవరూ కూడా అభ్యంతరకర పదజాలం వాడొద్దు అని, తమ ఆగ్రహాన్ని హుందాగా వెల్లగక్కుదాం అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

  English summary
  The latest episode of Priyanka Chopra starrer Quantico has not gone down well with a lot of Indians as the plot show Indian nationals plotting to blow up Manhattan, New York, just to frame it on Pakistan so that the neighbouring country can look bad in front of the United States and the world. Also, several people took offence with the term 'Indian nationalists' used on the show and took to Twitter slamming Priyanka Chopra and Quantico.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more