»   » గే సింగర్ ముద్దు: వేలంలో 60 లక్షలకు దక్కించుకున్న లేడీ! (ఫోటోస్)

గే సింగర్ ముద్దు: వేలంలో 60 లక్షలకు దక్కించుకున్న లేడీ! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాపా: సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు వాడిన వస్తువులు, వారి దుస్తులు వేలం వేయడం ఇప్పటి వరకు చూసాం. అప్పుడప్పుడు తారల లోదుస్తులు కూడా వేలం వేసిన సందర్భాలను చూసాం. ఇలా వేలం వేయగా వచ్చిన డబ్బును చారిటీ కార్యక్రమం కోసం ఉపయోగించడం మామూలే.

ఇలాంటి తరహాలోనే బ్రెజిల్‌లో ఇటీవల ఎయిడ్స్ చారిటీ కోసం ఓ వేలం నిర్వహించారు. ఇక్కడ వేలంగా పెట్టింది వస్తువులో, దుస్తులో కాదు.... హాలీవుడ్ సింగర్ రికీ మార్టిన్ తన లిప్‌కిస్ ను వేలానికి పెట్టారు. ఎవరు ఎక్కువ పాడితే వారికి తన అదర చుంబనం ఇస్తానని ప్రకటించాడు.

హాలీవుడ్‌ పాప్‌సింగర్‌గా ఫుల్‌ క్రేజ్‌ ఉన్న వారిలో రిక్కీ మార్టిన్‌ ఒకరు. తనని తాను స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్న సెలబ్రిటీల్లో రిక్కీ మార్టిన్ కూడా ఒకరు. ఆయన అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. రికీ మార్టిన్ ముద్దును దక్కించుకోవడానికి చాలా మంది ఫ్యాన్స్ పోటీ పడ్డారు. వీరిలో అనా పౌలా డినిజ్‌ అనే ఓ మహిళ వేలంలో 90వేల డాలర్లు(దాదాపు రూ.60 లక్షలు) పాడి రిక్కీ ముద్దును సొంతం చేసుకుంది.

రికీ మార్టిన్ గే అయినా... ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు. వీరి ముద్దు ఫోటోలు, వీడియో ఇపుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. స్లైడ్ షోలో వీరి ముద్దుకు సంబంధించిన వీడియో, ఫోటోస్....

rn

ముద్దు వీడియో..

వేలంలో తన ముద్దు దక్కించుకున్న అభిమానికి రికీ మార్టిన్ ఇలా అదర చుంబనం అందించారు.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

ఇంత రేటు పెట్టి ఓ గే సింగర్ ముద్దును దక్కించుకోవడం చర్చనీయాంశం అయింది.

రికీ మార్టిన్

రికీ మార్టిన్

హాలీవుడ్ పాపులర్ సింగర్లలో రికీ మార్టిన్ ఒకరు. తనను తాను ఆయన స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు.

అనా పౌలా డినిజ్‌

అనా పౌలా డినిజ్‌

వేలంలో 90వేల డాలర్లు(దాదాపు రూ.60 లక్షలు)కు రికీ మార్టిన్ ముద్దు దక్కించుకున్న అనా పౌలా డినిజ్ ఈవిడే.

English summary
Female Ricky Martin fan bids an eye-watering $90,000 to passionately kiss the gay singer at amfAR Inspiration Gala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu