»   » సెక్సువల్ వేధింపులు: సింగర్ షాకింగ్ కామెంట్

సెక్సువల్ వేధింపులు: సింగర్ షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: రిటా ఓరా...బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్, నటి. పెద్దగా పాపులారిటీ లేక పోయినా....2015లో జరిగిన ఆస్కార్ వేడుకల తర్వాత ఆమె ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారి పోయారు. ఈ వేడుకలకు ఆమె షీర్ గౌన్ ధరించి హాజయ్యారు. అండర్ వేర్ సైతం లేకుండా ఉన్న ఈ డ్రెస్ ఆమెను నగ్న దేవతలా ఆవిష్కరించింది.

తాజాగా రీటా ఓరా మరో షాకింగ్ విషయం బయట పెట్టింది. తనకు పద్నాలుగేళ్ల వయసులోనే సెక్సువల్ వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. లండన్ లోని సిల్వియా యంగ్ థియేటర్ స్కూల్ లో డ్రామా స్టూడెంటుగా ఉన్నపుడు 26 ఏళ్ల వ్యక్తిపై తనను సెక్సువల్ గా వేధించాడని తెలిపింది.

అయితే అది అనుకోకుండా జరిగిన సంఘటన. అతను నన్ను లోబరుకున్నాడు. నేను అతనికి లొంగి పోయాను. దీన్ని లైంగిక దాడి అని మాత్రం నేను చెప్పలేను. ఒక అబ్బాయితో నా ఫస్ట్ రిలేషన్ షిప్ గా భావించాను. ఆ వయసులో నాకు అది కావాలనిపించింది. ఈ సంఘటనను నేను చైల్డ్ సెక్సువల్ వేధింపులుగా భావించను అంటూ రిటా ఓరా చెప్పుకొచ్చింది.

Rita Ora says she was abused aged 14 but claims she 'wanted it'

మిలియన్ల కొద్దీ అమ్మాయిలకు రోల్ మోడల్ గా ఉన్న రిటా ఓరా.... లాంటి ఓ సెలబ్రిటీ సెక్సువల్ వేధింపుల విషయంలో ఇలా ఆలోచించడంపై పలు చిల్డ్రన్స్ చారిటీస్ తప్పు బట్టాయి. ఆమె వ్యాఖ్యలు పిల్లలపై ప్రభావం చూపుతాయని మండి పడ్డారు.

దీనిపై రీటా ఓరా స్పందిస్తూ...దాని వల్ల నేను సఫర్ అయ్యానని ఎప్పుడూ చెప్పలేదు. ఆ సమయంలో నాకు అది కావాలనిపించింది. నేను వేధింపులకు గురైనట్లు ప్రజలు భావించాలని కోరుకోవడం లేదు. అపుడు నాకు 14 ఏళ్ల వయసు. చాలా మెచ్యూర్ వయసు అని రీటా ఓరా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

English summary
Rita Ora has revealed she was groomed by a 26-year-old man when she was 14, but claimed it was a boost to her confidence, it has been reported. The X Factor judge said the sexual abuse took place when she was a drama student at London's Sylvia Young Theatre School.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu