»   » నమ్మరు కానీ నిజం :వేల కోట్ల వసూళ్లు కోసం...‘భేతాళుడు’ స్ట్రాటజీనే ‘స్టార్‌ వార్స్‌’ కొత్త సినిమాకి

నమ్మరు కానీ నిజం :వేల కోట్ల వసూళ్లు కోసం...‘భేతాళుడు’ స్ట్రాటజీనే ‘స్టార్‌ వార్స్‌’ కొత్త సినిమాకి

Posted By:
Subscribe to Filmibeat Telugu

  లాస్ ఏంజిల్స్ : రీసెంట్ గా విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన భేతాళుడు చిత్రానికి ఓపినింగ్స్ రప్పించటానికి, క్రేజ్ క్రియేట్ చేయటానికి ఓ పదినిముషాల క్లిప్ ని రిలీజ్ ముందు ప్రదర్శించారు. ఇప్పుడు అదే స్టాటజీని 'స్టార్‌ వార్స్‌' పరంపరలో పదో చిత్రంకు కూడా ప్లే చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే అమెరికాలోని కొన్ని థియేటర్లలో తొలి 28 నిమిషాల భాగాన్ని ప్రదర్శించారు. దాంతో ఈ చిత్రానికి పిచ్చ క్రేజ్ క్రియేట్ అవుతోంది.

  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న అమెరికన్ ఎపిక్ స్పేస్ ఒపేరా చిత్రం రోగ్‌వన్ : ఎ స్టార్ వార్స్ స్టోరీ. ఈ చిత్రానికి దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్. ఈ చిత్రంలో ఫెలిసిటీ జోన్స్‌, డిగో లునా, బెన్ మెండోల్సోహన్‌, డోనీయోన్‌, మాడ్స్ మిక్కిల్‌సెన్‌, అలాన్ టుడెక్‌, జియాంగ్ వెన్‌, ఫారెస్ట్ విట్టేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మైఖేల్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

  గాడ్జిల్లా డైరక్టర్ తో..

  గాడ్జిల్లా డైరక్టర్ తో..

  తాజాగా స్టార్‌ వార్స్‌ థీమ్‌తో ఆంథాలజీ ట్రైలాజీ రెడీ చేయటం కొత్త విషయం. అందులో భాగంగా తెరకెక్కిన తొలి చిత్రమే ‘రోగ్‌వన్‌: ఎ స్టార్‌ వార్స్‌ స్టోరీ'. ‘గాడ్జిల్లా' దర్శకుడు గరెత్‌ ఎడ్వర్డ్స్‌ రూపొందించిన ఈ చిత్రంలో ఫెలిసిటీ జోన్స్‌, డెగో లునా, బెన్‌ మెండెల్షొన్‌, డానీ యెన్‌ ప్రధాన పాత్రల్లో నటించటంతో మంచి క్రేజే క్రియేట్ అయ్యింది.

  అంచానాలు అంతకు మించి..

  అంచానాలు అంతకు మించి..

  స్టార్‌ వార్స్‌ ఫ్రాంఛైజీలో వస్తున్న పదో చిత్రం ‘రోగ్‌వన్‌'ను 200 మిలియన్‌ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం గమనార్హం. దానికి తగ్గట్లే ఈ చిత్రంపై అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. వాటిని రీచ్ అవుతామనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.

  ట్రైలాజీ ముందు జరిగే కథే...

  ట్రైలాజీ ముందు జరిగే కథే...

  స్టార్‌ వార్స్‌ ప్రీక్వెల్‌ ట్రైలాజీకి గ్రాఫిక్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన జాన్‌ నొల్‌ పదేళ్ల క్రితం ఈ చిత్రానికి కథని అందించాడు. అందుకు కథారచయితగా ఆయనకు టైటిల్స్‌లో క్రెడిట్‌ ఇవ్వడంతో పాటు చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు అందజేశారు. స్టార్‌వార్స్‌ ప్రీక్వెల్‌ ట్రైలాజీకి ముందు చోటుచేసుకున్న సంఘటనలతో ఈ చిత్రం రూపొందింది.

   మొదటి 28 నిముషాలను..

  మొదటి 28 నిముషాలను..

  ఈ చిత్రం విడుదలకు ముందే అమెరికాలోని కొన్ని థియేటర్లలో తొలి 28 నిమిషాల భాగాన్ని ప్రదర్శించారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. స్టార్‌ వార్స్‌ ఫ్రాంఛైజీ విజయ పరంపరను ఈ చిత్రం కొనసాగిస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే ఈ చిత్రం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అక్కడ చక్కటి ఆదరణ దక్కించుకుంటోంది.

  అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదుర్స్‌

  అడ్వాన్స్‌ బుకింగ్‌లో అదుర్స్‌

  ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్‌లో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తొలి 24 గంటల్లోనే అడ్వాన్స్‌ బుకింగ్‌లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన రెండో చిత్రంగా నిలిచింది. తొలి వారాంతంలోనే ఈ చిత్రం 350 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

  వేల కోట్ల వసూళ్లు

  వేల కోట్ల వసూళ్లు

  ఇప్పటికే హాలీవుడ్‌లో ‘స్టార్‌ వార్స్‌' ఫ్రాంఛైజీలో తెరకెక్కిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేల కోట్ల రూపాయల వసూళ్లతో కనకవర్షం కురిపించాయి. ఇంతకాలం ఈ ఫ్రాంఛైజీలో ఒరిజినల్‌ ట్రైలాజీ, ప్రీక్వెల్‌ ట్రైలాజీ, సీక్వెల్‌ ట్రైలాజీల రూపంలో తొమ్మిది చిత్రాలు రూపొందాయి.

  అప్పట్లో రికార్డ్..

  అప్పట్లో రికార్డ్..

  అంతరిక్షంలో మానవులకు, గ్రహాంతరవాసులకు మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో దర్శకుడు జార్జ్‌ లుకాస్‌ 1977లో తొలి ‘స్టార్‌ వార్స్‌' చిత్రాన్ని తెరకెక్కించాడు. 11 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిన ఆ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 770 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది. దాని తర్వాత ఈ నలభై ఏళ్ల కాలంలో వచ్చిన మిగతా ‘స్టార్‌ వార్స్‌' చిత్రాలూ సత్తా చాటాయి.

  ఈ ట్రైలర్ కే మంచి క్రేజ్

  ఇక ఈ చిత్రం ప్రమోషన్ కోసం విడుదల చేసిన ఈ ట్రైలర్ కు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ట్రైలర్ ని మీరు ఇప్పటికి చూడకపోతే చూసేయండి మరి.

  English summary
  Rogue One: A Star Wars Story is set for release on December 16th, 2016. The full Star Wars movie release calendar can be found here. The film will release one day early in the UK, according to the official Star Wars Twitter account. UK will get the film on Dec. 15 while the US and Canada get the film on Dec. 16. Empire reports that some countries will get the film as early as Dec. 14.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more