»   »  మన బుడ్డోడే...హాలీవుడ్ దున్నేస్తున్నాడు

మన బుడ్డోడే...హాలీవుడ్ దున్నేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rohan Chand in The Hundred Foot Journey (2014)
న్యూయార్క్: ఆరేళ్ల ప్రాయంలోనే చిత్రోత్సాహంతో అటు హాలీవుడ్‌ తెరపైనా, ఇటు బాలీవుడ్‌ తెరపైనా దున్నేస్తున్నాడు రోహన్‌. అతనో ప్రవాస భారతీయ బాల నటుడు. న్యూయార్క్‌లోని బ్రూక్లీన్‌లో నివసించే రోహన్‌ తన ఆరో ఏట నుంచే నటనారంగంలోకి అడుగుపెట్టాడు. ఇతడి నటనను చూడగానే 'అరె మనవాడిలో ఇంత ప్రతిభ ఉందా' అనిపించక మానదు. ఐశ్వర్యారాయ్‌, అమితాబ్‌ బచ్చన్‌, ఓంపురి, ఇర్ఫాన్‌ ఖాన్‌ వంటి బాలీవుడ్‌ దిగ్గజాలతో కూడా ఇప్పుడు రోహన్‌ చాంద్‌ నటిస్తున్నాడు. యుద్ధం ఇతివృత్తంగా రూపుదిద్దుకున్న 'లోన్‌ సర్వైవర్‌'లోనూ హాలీవుడ్‌ నటుడు మార్క్‌ వాల్‌బర్గ్‌తో కలిసి నటించాడు.

ఆరు సంవత్సరాల వయసులోనే రోహన్‌ 'జాక్‌ అండ్‌ జిల్‌' చిత్రంలో నటించాడు. గత నెలలో విడుదలైన హాస్యభరిత చిత్రం 'బ్యాడ్‌ వర్డ్స్‌'లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపాడు. ఈ చిత్రానికి దర్శకుడు జేసన్‌ బెటెమన్‌ కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 'టోరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం'లో ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇందులోని నటనకు మంచి గుర్తింపును దక్కించుకున్నాడు రోహన్‌. ప్రేరణ నటుడు, దర్శకుడు జేసన్‌ బెటెమెన్‌ అంటాడు రోహన్‌. ఈ దర్శకుడి ధారావాహికలు చూడటంవల్లే చిత్రాల్లో నటించాలన్న కోరిక పెరిగిందట.

ప్రస్తుతం ఈ అబ్బాయి 'ది హండ్రెడ్‌ ఫీట్‌ జర్నీ'లో భారతీయ నటి నటులతోపాటు హాలీవుడ్‌ తారలతో కలిసి తెరను పంచుకోవడం విశేషం. ఇందులో రోహన్‌తో పాటు ఓంపురి, జూహీ చావ్లా, మనీష్‌ దయాళ్‌, హెలెన్‌ మిరెన్‌లు నటిస్తున్నారు. మన దేశం నుంచి ఫ్రాన్స్‌కు వెళ్ళిన ఒక పాకశాస్త్ర నిపుణుడు(చెఫ్‌) స్థానికులతో పోటీపడి వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి పడిన ప్రయాసకు తెర రూపమే ఈ చిత్రం. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రను రోహన్‌ చాంద్‌ పోషించాడట. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తుండటం మరో విశేషం.

English summary

 Rohan Chand has recently been seen in Peter Berg's Lone Survivor (2013) with Mark Wahlberg and can now be seen in his co-leading role in Jason Bateman's directorial debut, Bad Words (2014). Upcoming films include The Hundred Foot Journey (2014), directed by Lasse Hallström, and he is currently voicing a lead role in a DreamWorks Animated Feature (2016).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu