»   » ఆమె సినీ బిజినెస్ 22 వేల కోట్లు, ఎవరూ లేక పోవడంపై నిరాశ...

ఆమె సినీ బిజినెస్ 22 వేల కోట్లు, ఎవరూ లేక పోవడంపై నిరాశ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ హాలీవుడ్లో టాప్ ఎర్నింగ్ నటిగా రికార్డుల కెక్కడంపై సంతోషం వ్యక్తం చేయడానికి బదులు...డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. టాప్ 10 లిస్టులో నేనొక్కదాన్నే మహిళను ఉండటం ఎగ్జైట్ అయ్యే విషయమే అయినా...మరో రకంగా డిసప్పాయింట్మెంట్ కలింగించింది. ఇతర నటీమణులు ఎవరూ టాప్ 10 లిస్టులో లేక పోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అని వ్యాఖ్యానించారు.

ప్రముఖ బాక్సాఫీసు రిపోర్ట్ వెబ్ సైట్ మోజో విడుదల చేసిన లెక్కల ప్రకారం.... స్కార్లెట్ జాన్సన్ నటించిన సినిమాల బిజినెస్ బాక్సాఫీసు వద్ద 3.3 బిలియన్ డాలర్లు(రూ. 22 వేల కోట్లు) చేరుకుంది. దీంతో హాలీవుడ్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ యాక్టర్ గా ఆమెకు టాప్ 10లో చోటు దక్కింది.

Scarlett Johansson Disappointed to Be Highest Earning Actress

తను ఈ కొత్త ఫీట్ సాధించడంపై ఆమె ఓ టీవీషోలో స్పందిస్తూ...టాప్ 10 లిస్టులో ఉన్న ఒకే ఒక మహిళగా ఎగ్జైట్ అయ్యే విషయమే అయినా, ఇందులో ఒకే మహిళకు చోటు దక్కడం డిసప్పాయింట్ అయ్యే అంశమే. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు.

స్కార్లెట్ జాన్సన్ నటించిన క్లాసిక్ మూవీస్ లాస్ట్ ఇన్ ట్రాన్స్ లేషన్, అండర్ ది స్కిన్ లతో పాటు ది అవేంజర్స్ చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. దీంతో ఆమె హాలీవుడ్ ఆల్ టైమ్ మనీ మేకింగ్ స్టార్ల జాజితాలో 10వ స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ లిస్టులో అంతా మేల్ యాక్టర్లే ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న ఏకైక ఫిమేల్ యాక్టర్ స్కార్లెట్ జాన్సన్.

English summary
Actress Scarlett Johansson is "disappointed" to be named the top-earning actress of all time in Hollywood. Johansson was recently named the highest grossing actress in Hollywood. According to box office reporting website Box Office Mojo, Johansson has already raked in $3.3 billion at the US box office, making her the 10th highest earning actor -- male or female -- in Hollywood. However, The Avengers actress had a conflicted opinion about her new feat. "It's exciting to be the only woman in this category," Johansson told TV show Extra TV. "It's kind of disappointing actually to be the only woman in this category. That was a little bit of a surprise to me," the 31-year-old added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu