twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నుంచి తప్పించుకున్న యాక్టర్, డైరెక్టర్.. కారు అక్కడే వదిలేసి..

    |

    ప్రపంచాన్ని కదిలిస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై రోజుకో వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపడానికి చాలామంది ప్రజలు కోరుకుంటున్నప్పటికి చిన్న దేశం ఉక్రెయిన్ పై రష్యా పై చేయి సాధించేందుకు వర్ డోస్ ను ఇంకా పెంచుతోంది. అయితే ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురుస్తుండడంతో అక్కడి ప్రజలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక ఈ యుద్ధంలో ఇటీవల ఒక ఆస్కార్ విజేత హాలీవుడ్ నటుడు కూడా చిక్కుకోవడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన సేఫ్ గా బార్డర్ దాటి వెళ్లిపోయారు అని సోషల్ మీడియాలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇంతకు ఆ నటుడు ఎవరు ? ఉక్రెయిన్ ఎందుకు వెళ్ళాడు అనే వివరాల్లోకి వెళితే..

    ఉక్రెయిన్ యుద్ధంలో హాలీవుడ్ నటుడు

    ఉక్రెయిన్ యుద్ధంలో హాలీవుడ్ నటుడు

    హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ డైరెక్టర్ సీన్ జస్టిన్ పెన్ ఒక స్క్రీన్ రైటర్ కూడా అలాగే నిర్మాతగా కూడా అతను పలు డాక్యుమెంటరీలను ప్రొడ్యూస్ చేశాడు. అతను పలు చిత్రాలతో తన పాత్రలకు గాను రెండు అకాడమీ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. అయితే ఇటీవల అతను కొద్దిపాటిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నుంచి బయటపడ్డట్లుగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    డాక్యుమెంటరీ కోసం..

    డాక్యుమెంటరీ కోసం..

    ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల వరుస దాడులు మొదలు పెట్టగా కైవ్‌లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన వార్తా సమావేశనికి పెన్ వెళ్ళాడు. అక్కడ అతను ఉన్నట్టు ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌ లోనే పెన్ ఒక డాక్యుమెంటరీ కోసం పనిచేస్తున్నట్లు అందరికి అర్థమైంది. రష్యా దండయాత్రకు సంబంధించి పెన్ ట్విట్టర్‌లో ఒక ప్రకటనను కూడా షేర్ చేసుకున్నాడు.

    కారుని అక్కడే విడిచిపెట్టి..

    కారుని అక్కడే విడిచిపెట్టి..


    ఇక ఫైనల్ గా అతను రష్యా దాడుల నుంచి తప్పించుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన కారుని అక్కడే విడిచిపెట్టి పోలాండ్ సరిహద్దు వైపు అడుగు పెట్టాడు. ఈ సోమవారం, అకాడమీ అవార్డు గెలుచుకున్న ఈ వ్యక్తి ట్విట్టర్‌లో కూడా స్పందించాడు. తన ఇద్దరు సహోద్యోగులు తమ కారును రహదారి పక్కన వదిలిపెట్టినట్లు చెబుట్జూ.. పోలిష్ సరిహద్దుకు దగ్గరలోనే మైళ్లు నడిచినట్లు వెల్లడించారు.

    స్పెషల్ పోస్ట్ వైరల్

    పెన్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నాడు, "నేను అలాగే నా ఇద్దరు సహోద్యోగులు మా కారును రోడ్డు పక్కన వదిలిపెట్టి పోలిష్ సరిహద్దుకు మైళ్ల దూరం నడవడం జరిగింది. ఇక మీరు చూస్తున్న ఈ ఫోటోలోని దాదాపు అన్ని కార్లు మహిళల కోసం అలాగే పిల్లలను మాత్రమే తీసుకువెళతాయి. సామాన్లు తీసుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు వారికి విలువైనది ఒక కారు మాత్రమే.. అంటూ పెన్ ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

    ఉక్రెయిన్ పై ప్రశంసలు

    ఉక్రెయిన్ పై ప్రశంసలు

    ఇక ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రేనియన్ ప్రజలు ధైర్యమని కూడా పెన్ గతంలో ట్విట్టర్ నివేదించారు. వారి యుద్ధం చరిత్రలో నిలిచిపోతుందని కూడా అన్నారు. ఇక పెన్ ఉక్రెయిన్‌లో ఒక డాక్యుమెంటరీని షూట్ చేస్తున్నప్పుడు అతని హాలీవుడ్ సహచరులు చాలా మంది లింక్స్ షేర్ చేసేందుకు ఎంతో ఆసక్తిని చూపారు. అయితే కొందరు నటీనటులు ఉక్రేనియన్ శరణార్థులకు సహాయం చేయడానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఇటీవల, నటుడు బ్రియాన్ కాక్స్ కూడా ఉక్రెయిన్‌కు తన మద్దతును అందించిన విషయం ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    English summary
    Sean Penn set afoot towards the Poland border after documentary shoot in Ukraine
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X