twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపటి నుంచే జేమ్స్ బాండ్ 'స్కైఫాల్'

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : జేమ్స్ బాండ్ చిత్రల పరంపరలో 23వ చిత్రంగా విడుదల కానున్న సినిమా 'స్కైఫాల్'. డేనియల్ క్రూగ్, హెలిన్ మెక్రోలి, బెరిన్స్‌మర్లోహ్, జావియర్ బార్టెన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సేమ్ మెండిస్ దర్శకత్వం వహించారు. 12 దేశాల్లో రేర్ లొకేషన్లలో తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ అందిస్తోంది. ఈ సినిమాను అమెరికా కంటే వారం రోజుల ముందు ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న విడుదల చేస్తున్నారు.

    బాండ్ చిత్రాలు మొదలై ఇప్పటికి అర్ధశతాబ్దం పూర్తయింది. 'స్కైఫాల్' అత్యంత భారీ వ్యయంతో, ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించిన సినిమా. హై ఎమోషనల్ యాక్షన్ పార్టు మెప్పిస్తుంది. ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు బావుందని మెచ్చుకుంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో డబ్బింగ్ అయి వస్తోంది.

    అందం, అంగాంగ ప్రదర్శన బాండ్‌గర్ల్ పాత్ర సొంతం. అంతటి అందగత్తె కాకున్నా బాండ్‌గర్ల్‌గా ఎంపికైన తాను అంగాంగ ప్రదర్శన చేయకుండానే ప్రేక్షకులను మెప్పిస్తానంటోంది హాలీవుడ్ నటి నవోమీ హ్యారిస్. 23వ జేమ్స్‌బాండ్ చిత్రం 'స్కైఫాల్'లో తాను బాండ్‌గర్ల్‌గా కనిపించబోతున్నానని, మిగతా వారిలా కాకుండా ఈ చిత్రంలో తనద్వారా ఓ ప్రత్యేకమైన బాండ్‌గర్ల్‌ను చూస్తార'ని నవోమీ చెప్పింది.

    'స్కైఫాల్' చిత్రం షూటింగ్ రెండేళ్ల క్రితమే ప్రారంభమైనా నిర్మాణ సంస్థ ఎమ్‌జీఎమ్ ఆర్థికంగా నష్టాల్లో ఉండడంతో విడుదల వాయిదా పడుతూవస్తోంది. ఎట్టకేలకు ఇండియాలో విడుదల చేసేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ముందుకు రావడంతో నవంబర్ 1 న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి క్రెయిగ్, జుడి డెన్చ్‌లు నాయక, ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఇక ఫ్రెంచ్ నటి బెరెనిస్ మార్లో మరో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనుంది.

    తెలుగు వెర్షన్ 'లోకం చుట్టిన వీరుడు' ని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తోంది. సుబ్రమణ్యం.బి., రూపేష్.యస్. నిర్మాతలు. ఈ సినిమా గురించి సుబ్రమణ్యం మాట్లాడుతూ " భవిష్యత్తులో మా సంస్థ అందించిన గొప్ప చిత్రాల జాబితాలో ఈ సినిమా పేరు తప్పకుండా చేరుతుంది. జేమ్స్‌బాండ్ సినిమాలకున్న క్రేజ్ కొత్తగా చెప్పనక్కర్లేదు అన్నారు.

    English summary
    "Skyfall" Starring Daniel Craig as 007 for a third time. Critics have declared the 23rd Bond film, starring Spanish actor Javier Bardem as Bond's latest nemesis, to be one of the finest in the suave British spy's 50 years on the screen. Directed by Oscar winner Sam Mendes, it opens with a spectacular chase scene in an Istanbul market but returns to home ground with a terror attack in London.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X