For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెప్పలేని చోట కాస్మోటిక్ సర్జరీ.. వికటించడంతో ప్రాణాపాయం.. కంపెనీపై 300 కోట్ల దావా వేసిన అందాల భామ

  |

  గ్లామర్ ఫీల్డ్‌లో తారలు తమ అందాన్ని సంరక్షించుకోవడానికి రకరకాల సర్జరీలు చేసుకోవడం సాధారణమే. అయితే కొన్నిసార్లు వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకొన్న దాఖలాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గడం లాంటి ప్రయత్నాలు చేసి ఆర్తి అగర్వాల్ లాంటి తారలు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రమాదానికి గురై అనారోగ్యం బారిన పడ్డ మరో అందాల భామ విషయం వెలుగులోకి వచ్చింది. కాస్మటిక్ సర్జరీ విషయంలో తనను తప్పుదోవ పట్టించిన కంపెనీపై దావా వేయడం సంచలనం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..

  Avika Gor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్.. ప్రైవేటు పార్టులో టాటూను చూపిస్తూ!

  లిండా‌కు అత్యంత పాపులారిటీ

  లిండా‌కు అత్యంత పాపులారిటీ

  అమెరికాలో సూపర్ మోడల్ లిండా ఎవాంజెలిస్టా అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ. 1990లో పలు సంచలన పత్రికలు, మ్యాగజైన్లపై పోటీ పడి ఆమె ఫోటోను కవర్ పేజీగా వేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటూ దాదాపు కనుమరుగైనంత పనిచేశారు.

  అయితే అలా ఆమె బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం అభిమానులకు అంతుపట్టలేదు. చాలా రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అసలు విషయాన్ని బయటపెట్టింది.

  Bigg Boss Telugu 5 Promo: లగ్జరీ టాస్కులో గొడవలు.. అతడిని తిట్టిన నటరాజ్.. జైలులో కూల్ కంటెస్టెంట్

  కాస్మోటిక్ సర్జరీ వికటించడంతో

  కాస్మోటిక్ సర్జరీ వికటించడంతో

  అయితే లిండా ఎవాంజెలిసా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చూస్తూ.. కాస్మోటిక్ సర్జరీ వికటించడంతో గత కొద్ది రోజులుగా నా కెరీర్‌కు దూరమయ్యాను. మీ అందరికి నేను కనిపించకపోవడం ఆందోళనకు గురై ఉంటారు. అయితే జెల్టిక్ కూల్ స్కల్ట్పింగ్ విధానంలో చేసుకొన్న కాస్మోటిక్ సర్జరీతో దారుణంగా నా ఆరోగ్యం దెబ్బ తిన్నది. నేను ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయాను. అందుకే నేను బాహ్య ప్రపంచానికి దూరమయ్యాను. కొన్ని ప్రాజెక్టులను వదులుకొన్నాను అని లిండా తెలిపారు.

  దారుణంగా అనారోగ్యానికి గురై..

  దారుణంగా అనారోగ్యానికి గురై..

  జెల్టిక్ అనే కంపెనీ తెలిపిన ప్రకారం కూల్ స్కల్ట్పింగ్ పద్దతి పూర్తిగా వికటించింది. వారు చెప్పినట్టు కాకుండా పూర్తిగా ప్రతికూలమైన ఫలితాన్ని ఇచ్చింది. పాడాక్సికల్ అడిపోస్ హైపర్‌ప్లాసియా అనే సైడ్ ఎఫ్టెక్ నన్ను పూర్తిగా నిర్వీర్వం చేసింది. నాకు ఎక్కడైతే కాస్మోటిక్ సర్జరీ చేశారో ఆ ప్రదేశాల్లో వాపు ఎక్కింది. అలాంటి పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అని లిండా తెలిపింది.

  మానసిక క్షోభను అనుభవించాను..

  మానసిక క్షోభను అనుభవించాను..

  నాకు తొడలు, పొత్తి కడుపు, గదవ, పిరుదులు, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో సర్జీరీ చేశారు. ఆ కాస్మొటిక్ సర్జరీ వికటించడం వల్ల నేను తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. తీవ్రమైన మానసిక రుగ్మతకు లోనయ్యాను. ఊహించని పరిణామం ఎదురు కావడంతో విషాదానికి గురయ్యాను. నేను మానసికంగా చాలా బాధపడ్డాను. నాకు నేనుగా మనోధైర్యాన్ని కోల్పోయాను. గత కొద్ది రోజులుగా ఒంటరిగా జీవితం గడిపాను. దాంతో తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించాను అని ఇన్స్‌టాగ్రామ్ ప్రకటనలో తెలిపారు.

  హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి !
  కాస్మోటిక్ కంపెనీ తప్పుదోవ పట్టించినందుకు

  కాస్మోటిక్ కంపెనీ తప్పుదోవ పట్టించినందుకు

  కాస్మోటిక్ సర్జరీకి సంబంధించిన వ్యాపార ప్రకటనలో అవాస్తవాలను వెల్లడించి చీటింగ్‌కు పాల్పడ్డారని, అలాగే తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సైడ్ ఎఫెక్ట్ గురించి వెల్లడించకుండా వాస్తవాలను దాచిపెట్టారు. కాబట్టి జెల్టిక్ కంపెనీపై నేను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో దావా వేసాను. నేను అనుభవించిన మానసిక క్షోభ పరిహారంగా 50 మిలియన్ డాలర్లు అంటే సుమారు 370 కోట్లు చెల్లించాలని దావా వేశాను అని లిండా తెలిపారు.

  English summary
  Super Model Linda Evangelista files $50 million lawsuit over Wrong cosmetic surgery. She wrote that, To my followers who have wondered why I have not been working while my peers’ careers have been thriving, the reason is that I was brutally disfigured by Zeltiq’s CoolSculpting procedure
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X