»   » ఇండియన్ ఫిలిమ్ హిస్టరీలోనే మొదటి సారి : దీపికా వల్లే వారం ముందే భారత్ లో XXX

ఇండియన్ ఫిలిమ్ హిస్టరీలోనే మొదటి సారి : దీపికా వల్లే వారం ముందే భారత్ లో XXX

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే 'ట్రిపుల్ ఎక్స్' కోస్టార్ విన్‌ డీజిల్ భారత్‌ను సందర్శించనున్నాడు. ట్రిపుల్ ఎక్స్ స్టార్ విన్‌డీజిల్ ఈ నెల 12న భారత్ వస్తున్నట్లు దీపికా పదుకొనే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్విట్టర్‌లో ట్రిపుల్ ఎక్స్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసిన దీపికా పదుకొనే..నీ రాక కోసం ఎదురుచూస్తున్నామంటూ విన్ డీజిల్‌కు సందేశాన్ని పోస్ట్ చేసింది. డీజే కారుసో దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'ట్రిపుల్ ఎక్స్..రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ ' ఈ నెల 14న భారత్‌లో విడుదల కానుంది. ఈ మూవీ విదేశాల‌లో కంటే వారం ముందుగానే భారత్ లో విడుద‌ల కానుండ‌టం విశేషం.

The action-packed film 'xXx' will release in India 'before anywhere else

కానీ హాలీవుడ్ యాక్షన్ హీరో విన్ డీజిల్ తో కలిసి దీపికా పదుకొనే నటించిన ట్రిపుల్ ఎక్స్-రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ మూవీని ఇండియాలో గ్రాండ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక శక్తివంతమైన ఆయుధం దుర్మార్గుల బారిన పడకుండా హీరో ఎలా కాపాడాడు.. అందుకోసం హీరో లవర్ సెరెనాగా నటించిన దీపికా ఎలా హెల్ప్ చేసిందన్నదే ఈ మూవీ స్టోరీ. భారత్ లో ఈ చిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ రిలీజ్ చేస్తుండగా.. జనవరి 14న గ్రాండ్ గా ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఇలా హాలీవుడ్ మూవీని ఇండియాలో ప్రీమియర్స్ ప్రదర్శించడం అంటే.. అదంతా కేవలం దీపికా పదుకునే పుణ్యమే అని చెప్పాలి. కేవలం 2డీ వెర్షన్ మాత్రమే కాకుండా.. 3డీ.. ఐమ్యాక్స్ 3డీ వెర్షన్లను కూడా ప్రీమియర్ల ద్వారా ప్రదర్శించనున్నారట. ప్రపంచం అంతా జనవరి 19న ఈ మూవీ విడుదల కానుంటే.. ఇండియన్ ఆడియన్స్ కి మాత్రం దీపికా పదుకొనే మాయతోపండుగ రోజునే చూసే చాన్స్ వచ్చింది.

English summary
The action-packed film 'xXx: Return of Xander Cage', which will mark actress Deepika Padukone's Hollywood foray, will release in India 'before anywhere else' in the world on January 14, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu