ప్రోడ్యూసర్స్ ఆఫ్ అమెరికా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఈసారి ఆసినిమాకే
శనివారం లండన్‌లో జరిగినటువంటి ప్రోడ్యూసర్స్ ఆఫ్ అమెరికా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డుని ద కింగ్స్ స్పీచ్ అనే సినిమా కైవసం చేసుకుంది. ఈ అవార్డుకి గాను రేస్‌లో బ్లాక్ స్వాన్, 127 అవర్స్, ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్, ద పైటర్ సినిమాలు పోటీపడ్డాయి. చివరకు ఈఅవార్డుని ద కింగ్స్ స్పీచ్ గెలుచుకోవడంతో అక్కడ ఒక్కసారిగా ఆనందాలు మిన్నంటాయి. ఇక పోతే బెస్ట్ యానిమేటడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్ స్టోరీ 3 అవార్డు దక్కించుకుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు కేటగిరిలో వెయిటింగ్ ఫర్ సూపర్ మ్యాన్ అనే సినిమా అవార్డు దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











