»   »  2016 : హాలీవుడ్‌ టాప్ 10 చిత్రాలు ఇవే..ఇవే ఎక్కువ డబ్బులు రాబట్టాయి

2016 : హాలీవుడ్‌ టాప్ 10 చిత్రాలు ఇవే..ఇవే ఎక్కువ డబ్బులు రాబట్టాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : ఒకప్పుడు హాలీవుడ్ చిత్రం అంటే ఇంగ్లీష్ సినిమా అంటూ శృంగారభరితమైన చిత్రాలను అదీ కొన్ని ధియోటర్లలోనే విడుదల చేసేవారు. తర్వాత పరిస్దితులు మారాయి. అక్కడ హైయిస్ట్ గ్రాసర్ చిత్రాలన్నీ ఇక్కడ తర్వాత డబ్బింగ్ అవటం మొదలెట్టి ఇక్కడా సక్సెస్ అవుతున్నాయి.

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తే...హాలీవుడ్ సినిమాలు స్ట్రైయిట్ గా ఇక్కడ రిలీజ్ అయ్యే రోజులు వచ్చేసాయి. అంతేకాదు కొన్ని చిత్రాలు అయితే ఇతర దేశాలు కన్నా ముందే మన దేశంలో రిలీజ్ చేసి డబ్బులు దండుకుంటన్నారు. జంగిల్ బుక్ వంటి చిత్రాలు ఇక్కడ బాగా కలెక్ట్ చేసాయి.

'జంగిల్‌ బుక్‌' చిత్రం భారత్‌లోనే రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం. దీంతో పాటు మరిన్ని చిత్రాలు 2016లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లతో అదరగొట్టి విజయఢంకా మోగించాయి. వసూళ్ల పరంగా తొలి పదిస్థానాల్లో నిలిచిన చిత్రాలేంటో చూద్దాం. అయితే ఈ లిస్ట్ లో యానిమేషన్ చిత్రాలు ఎక్కవ చోటు చేసుకోవటం ఆశ్చర్యం.

 ఇక్కడా 70 కోట్లు

ఇక్కడా 70 కోట్లు


సివిల్‌వార్‌: ‘కెప్టెన్‌ అమెరికా: ది ఫస్ట్‌ అవెంజర్‌', ‘కెప్టెన్‌ అమెరికా: ది వింటర్‌ సోల్జర్‌' చిత్రాలకు సీక్వెల్‌గా వచ్చింది. ఆంటోనీ రస్సో, జో రస్సో దర్శకులు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 115 కోట్ల డాలర్లకు పైగా వసూళ్లు దక్కాయి. భారత్‌లో ఈ చిత్రం 1323 తెరల్లో భారీగా విడుదలై రూ.70 కోట్లకు పైగా వసూలు చేసింది.

పిల్లల కోసం..

పిల్లల కోసం..

డోరీ అనే చేప ప్రధాన పాత్రగా త్రీడీ యానిమేషన్‌లో రూపొందించిన చిత్రం ఫైండింగ్‌ డోరీ. ఆండ్రూ స్టాంటన్‌ తెరకెక్కించారు. పిల్లలతో పాటు పెద్దలనూ ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. 103 కోట్లు డాలర్ల వసూళ్లతో రెండో అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఇండియాలో రూ.15 కోట్లకు పైగా వసూలు చేసింది.

 ఇండియాలో రికార్డ్

ఇండియాలో రికార్డ్

పోలీస్‌ అధికారి అయిన ఓ కుందేలు చుట్టూ తిరిగే కథతో ‘జూటోపియా' తెరకెక్కింది. ఇదీ త్రీడీ యానిమేషన్‌ చిత్రమే. బైరన్‌ హొవార్డ్‌, రిచ్‌ మూరె దర్శకులు. 102 కోట్ల డాలర్లు వసూలుచేసింది. ఇందులో చైనాలోనే 10 కోట్ల డాలర్ల వసూళ్లుండటం గమనార్హం. భారత్‌లోనే రూ.12 కోట్లు వసూళ్లు దక్కాయి.

 షాకింగ్ వసూళ్లు

షాకింగ్ వసూళ్లు

భారత్‌లోని ఓ అడవిలో మౌగ్లి అనే బాలుడికి, కొన్ని అడవి జంతువులకు మధ్య జరిగే కథతో తెరకెక్కిన చిత్రమిది. జాన్‌ ఫవ్‌రియు దర్శకుడు. మౌగ్లిగా ప్రధాన పాత్రలో భారతీయ అమెరికన్‌ కుర్రాడు నీల్‌ సేథీ నటించడం విశేషం. అతను తప్ప మిగతా పాత్రలన్నీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందినవే. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్‌ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. మనదేశంలో రూ.230 కోట్లు వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

 వెరైటీ ఫిల్మ్

వెరైటీ ఫిల్మ్

పిల్లి, కుక్క పిల్ల, చిలుక ప్రధాన పాత్రల్లో రూపొందిన త్రీడీ యానిమేషన్‌ చిత్రమిది. క్రిస్‌ రెనాడ్‌, యారో చెనీ దర్శకులు. 87 కోట్ల డాలర్లు వసూలు చేసింది. మన దేశంలో సోసోగా ఆడింది.

 ఇక్కడా బాగా ఆడింది

ఇక్కడా బాగా ఆడింది

డాన్‌ ఆఫ్‌ జస్టిస్‌: సూపర్‌ హీరో పాత్రల్లో విశేష ఆదరణ పొందిన సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌ కలయికలో తెరకెక్కిన తొలి చిత్రమిది. జాక్‌ స్నైడర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఇండియాలో రూ.36 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల డాలర్లు వసూళ్లు సాధించింది.

 మనవాళ్లూ బాగా చూసారు

మనవాళ్లూ బాగా చూసారు


మరో సూపర్‌హీరో చిత్రం ‘డెడ్‌పూల్‌' కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. టిమ్‌ మిల్లర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలో రూ.17 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల డాలర్లు వసూళ్లు సాధించింది.

విమర్శలు వచ్చినా

విమర్శలు వచ్చినా

ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ ఐర్‌ తెరకెక్కించిన ‘సూసైడ్‌ స్క్వాడ్‌' చిత్రానికి విమర్శలు ఎదురైనా వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళ్లింది. డేవిడ్‌ ఐర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం 74 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

 ఈ సినిమాతోనే..

ఈ సినిమాతోనే..

‘హ్యారీ పోటర్‌' సిరీస్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టు ఫైండ్‌ దెమ్‌. హ్యారీ పోటర్‌ పుస్తకాల రచయిత్రి జె.కె.రౌలింగ్‌ ఈ చిత్రంతో స్క్రీన్‌ప్లే రైటర్‌గా మారింది. డేవిడ్‌ యేటెస్‌ రూపొందించిన ఈ చిత్రం 72 కోట్ల డాలర్లు వసూలు చేసింది.

ఇక్కడ జస్ట్ ఓకే

ఇక్కడ జస్ట్ ఓకే

డాక్టర్‌ స్ట్రేంజ్ కూడా సూపర్‌ హీరో చిత్రమే. స్కాట్‌ డెరిక్‌సన్‌ తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల డాలర్లు వసూలు చేసింది. మన దగ్గర మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. ‘ఎవెంజర్స్' సిరీస్ చిత్రాలకు ఇంటర్ కనెక్షన్ ఉన్న ఈ చిత్రానికి ఇంకాస్త పటిష్టమైన కథనాన్ని రెడీ చేసుకొని ఉంటే బాగుండేది. అయితే మార్వెల్ మూవీస్ ఫ్యాన్స్ ను మాత్రం విశేషంగా అలరించాడు.

English summary
Check out above to see top ten films of 2016. And Happy New Year. We hope 2017 turns out to be as good a year for movies as this one has been.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu